Credit Card vs Loan: క్రెడిట్ కార్డు వాడాలా? లోన్ తీసుకోవాలా? కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ తెచ్చుకోండి!

Credit Card vs Loan: క్రెడిట్ కార్డు వాడాలా? లోన్ తీసుకోవాలా? కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ తెచ్చుకోండి!


ఆన్‌లైన్‌లో ప్రొడక్ట్స్ కొనేందుకే కాకుండా ఇతర ఖర్చులకు కూడా క్రెడిట్ కార్డ్‌నే వాడుతుంటారు చాలామంది. కార్డు స్వైప్ చేసి క్యాష్ గా కన్వర్ట్ చేసుకోవడం లేదా క్రెడిట్ కార్డు నుంచి బ్యాంక్ అకౌంట్ కు డబ్బు ట్రాన్స్ ఫర్ చేయడం వంటివి చేస్తుంటారు. అయితే రూ. లక్ష కంటే ఎక్కువ మొత్తం అవసరమైనప్పుడు క్రెడిట్ కార్డు కంటే లోన్ బెటర్ అంటున్నారు నిపుణులు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

వడ్డీ తక్కువ

క్రెడిట్‌ కార్డులతో పోలిస్తే పర్సనల్ లోన్స్‌కు వడ్డీ తక్కువ ఉంటుంది. కాబట్టి, పెద్ద మొత్తాలకు లోన్స్ వాడడమే బెటర్. దీనివల్ల వడ్డీ భారం తగ్గుతుంది. అలాగే టైంకి బిల్లు కట్టలేకపోతే క్రెడిట్ కార్డు లేట్ పేమెంట్ ఛార్జీలు అధికంగా ఉంటాయి. పర్సనల్ లోన్ విషయంలో దీనిపై కొన్ని వెసులు బాట్లు ఉంటాయి.

మల్టిపుల్ ఆప్షన్స్

క్రెడిట్ కార్డు కంపెనీలతో పోలిస్తే.. పర్సనల్ లోన్స్ ఇచ్చే సంస్థలు ఎక్కువగా ఉంటాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు తక్కువ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు లేని రుణాలను అందిస్తుంటాయి. క్రెడిట్ కార్డుల్లో ఇలాంటి వెసులుబాటు ఉండదు.

ప్రీ క్లోజర్స్

కొన్ని ఈఎంఐలు కట్టిన తర్వాత డబ్బు ఉంటే  లోన్‌ను ముందే క్లోజ్ చేసేయొచ్చు. చాలా సంస్థలు ఈ ప్రీ క్లోజర్ ఆప్షన్‌ను అందిస్తాయి.  క్రెడిట్‌ కార్డుల్లో కూడా ఈ ఫెసిలిటీ ఉంటుంది. కానీ, క్రెడిట్ కార్డు క్లోజర్‌‌కు కొన్ని అదనపు ఛార్జీలు వర్తిస్తాయి.  పర్సనల్ లోన్స్‌తో పోలిస్తే క్రెడిట్ కార్డుల్లో ఈ ఛార్జీలు ఎక్కువ.

లోన్ తో క్రెడిట్ బిల్..

క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక ఇబ్బంది పడుతున్నవాళ్లు కూడా పెనాల్టీ ఛార్జీలను తగ్గించుకునేందుకు పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. లోన్ అమౌంట్‌తో కార్డు బ్యాలెన్స్ అంతా ఒకేసారి చెల్లించి.. లోన్ అమౌంట్‌ను తక్కువ ఈఎంఐలుగా పెట్టుకుంటే కొంత భారం తగ్గుతుంది.

రూ. లక్ష దాటితే..

క్రెడిట్ కార్డుని చిన్న మొత్తాలకు వాడుకుంటేనే బాగుంటుందనేది నిపుణుల సూచన. రూ. లక్ష లోపు అవసరాలకు క్రెడిట్ కార్డు బాగుంటుంది. అంతకంటే ఎక్కువ మొత్తం అవసరమైనప్పుడు లోన్ ఆప్షన్ కు వెళ్లడమే మంచిది.

ఇబ్బందులూ ఉన్నాయి

అయితే క్రెడిట్ కార్డుతో పోలిస్తే లోన్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. క్రెడిట్ కార్డు నుంచి కావాల్సిన అమౌంట్ త్వరగా పొందొచ్చు. లోన్ అయితే ఒకట్రెండు రోజుల టైం పడుతుంది. ఒకలోన్ ఉండగా మరొక లోన్ లభించే అవకాశం ఉండదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *