OG సినిమా టికెట్ల పెంపునకు మరోసారి షాక్.. ఇచ్చిన ఉత్తర్వులే పొడిగించిన హైకోర్టు..!

OG సినిమా టికెట్ల పెంపునకు మరోసారి షాక్.. ఇచ్చిన ఉత్తర్వులే పొడిగించిన హైకోర్టు..!


తెలంగాణలో పవన్ కల్యాణ్ నటించిన OG సినిమా టికెట్ల పెంపునకు మరోసారి షాక్ తగిలింది. రివ్యూ తర్వాత కూడా పెంపునకు హైకోర్టు ఓకే చెప్పలేదు. సెప్టెంబర్ 24వ తేదీ ఇచ్చిన ఉత్తర్వులే పొడిగిస్తూ మళ్లీ జడ్జిమెంట్‌ ఇచ్చారు న్యాయమూర్తి. అక్టోబర్ 9 వరకు ఇవే ఉత్తర్వులు కొనసాగుతాయని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. తదుపరి విచారణ అక్టోబర్ 9 కు వాయిదా వేసినట్లు హైకోర్టు బెంచ్ ప్రకటించింది.

ఓజీ.. ఓజీ.. ఓజీ.. తెలుగురాష్ట్రాల్లో ఓజీ ఫీవర్ మామూలుగా లేదు. సినిమా రిలీజైంది. ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు అంతవరకు ఓకే. బట్ టికెట్ రేట్ల వివాదం మాత్రం ఇంకా సద్దుమణగలేదు. టికెట్ పెంపు అన్నది ఓజీ సమస్య కాదు. ఇండస్ట్రీ సమస్య. అసలు సినిమా రేట్లు ఇంతని ఫిక్సయినప్పుడు.. మళ్లీ పెరుగుదల ఎందుకు.. అన్నది సగటు ప్రేక్షకుడి ప్రశ్న.

సినిమా విడుదలైన తర్వాత 10రోజుల వరకూ థియేటర్ స్థాయిని బట్టి 100, 150 రూపాయలు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం మెమో ఇచ్చింది. అయితే దాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. టికెట్ల రేట్ల పెంపు వద్దంటూ గవర్నమెంట్‌ మెమోని సింగిల్ బెంచ్ సస్పెండ్ చేసింది. అసలు తమ వెర్షన్ వినకుండా తీర్పు ఎలా ఇస్తారని చిత్రయూనిట్‌ డివిజన్ బెంచ్‌కి ముందు అప్పీలుకు వెళ్లింది. చిత్ర నిర్మాతల వెర్షన్ కూడా వినాలని డివిజన్ బెంచ్ మరోసారి సింగిల్ బెంచ్‌కి రిఫర్ చేసింది. అయినా ఇవాళ కూడా అదే తీర్పుని కొనసాగించారు జడ్జి.

పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్‌కు ముందు నుంచే టికెట్ పెంపుపై పెద్ద రచ్చే జరిగింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ పెంపుకు అనుకూలంగా మెమో కూడా జారీ చేసింది. కానీ సామాన్యులపై భారం మోపుతున్నారంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రభుత్వం మెమోను సస్పెండ్ చేస్తూ టికెట్ ధరలను పెంచవద్దంటూ సింగిల్ బెంచ్ తీర్పు కూడా ఇచ్చింది. కానీ మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *