కొత్తవారికి లక్ష డాలర్లు ఫీజు చెల్లించే బదులు, ఇప్పటికే వీసా కలిగి ఉండి ఉద్యోగం కోల్పోయిన పాత నిపుణులను తిరిగి నియమించుకోవడం మంచిదని భావించిన టెక్ కంపెనీలు ఆ దిశగా మొగ్గు చూపుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాక, వ్యయ నియంత్రణ చర్యల కారణంగా ఒరాకిల్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. గణాంకాల ప్రకారం, 2024లో 2,38,461 మంది, 2025 జనవరి నుంచి ఇప్పటివరకు 1,44,926 మంది టెక్ ఉద్యోగులు తమ కొలువులు కోల్పోయారు. వీరిలో చాలామంది హెచ్-1బీ వీసా కలిగినవారే. నిబంధనల ప్రకారం, వీరు 60 రోజుల్లోపు మరో ఉద్యోగం సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ట్రంప్ వీసా రుసుము పెంపు నిర్ణయం నేపథ్యంలో అక్కడి టెక్ కంపెనీలకు మరోసారి ఉద్యోగం నుంచి తొలగించినవారిని తమ కంపెనీలో చేర్చుకునే అవకాశం కనిపిస్తోంది. కొత్తగా వీసా స్పాన్సర్ చేసే ఖర్చుతో పోలిస్తే, ఇప్పటికే అమెరికాలో ఉన్న వీసా హోల్డర్లను నియమించుకోవడం కంపెనీలకు ఈజీ. వీరికి మళ్లీ లాటరీతో పని లేకుండా, సాధారణ ట్రాన్స్‌ఫర్ పిటిషన్‌తో సులువుగా ఉద్యోగంలోకి తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటీవల ఉద్యోగాలు కోల్పోయిన వారికి త్వరలోనే కంపెనీల నుంచి తిరిగి ఉద్యోగ ఆఫర్ వచ్చే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఇమిగ్రేషన్ న్యాయ సంస్థ ‘చగ్ ఎల్‌ఎల్‌సీ’ న్యాయవాది నవనీత్ ఎస్ చగ్ తెలిపారు. మరోవైపు, ఈ పరిణామాల నేపథ్యంలో సిటీగ్రూప్, గోల్డ్‌మ్యాన్ శాక్స్ వంటి అమెరికన్ బ్యాంకులు తమ కార్యకలాపాల కోసం భారత్‌లో ఉన్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లపై మరింతగా ఆధారపడటానికి సిద్ధమవుతున్నాయని బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది. దీంతో అమెరికాలోని నియామకాల భారాన్ని తగ్గించుకుంటూ, భారత కేంద్రాల ద్వారా తమ పనులను కొనసాగించే వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్! ఏటీఎం విత్‌డ్రా ఎప్పటి నుంచి అంటే
విమానాశ్రయంలో ప్రయాణికుడి ప్యాంట్‌లో దూరి కరిచిన ఎలుక
చాట్‌జీపీటీ సాయంతో రూ. 1.32 కోట్ల లాటరీ గెలిచిన మహిళ
Sink Hole: నడిరోడ్డుపై పేద్ద.. గొయ్యి.. పదుల సంఖ్యలో పడ్డ వాహనాలు
గ్యాస్ బండ పేలితే.. పరిహారం చెల్లించాల్సిందే