ఎడ్వర్డ్స్.. అందరిలా కాకుండా అరుదుగా మాత్రమే లాటరీ కొనుగోలు చేస్తుంది. అయితే ఈసారి ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించి.. తన ఫోన్లోని చాట్‌జీపీటీ అప్లికేషన్‌ను సంప్రదించింది. “చాట్‌జీపీటీ.. నువ్వు నాకు కొన్ని నంబర్లు ఇవ్వగలవా?” అని ఆమె సంభాషణ మొదలు పెట్టారు. దీంతో చాట్‌జీపీటీ ఇచ్చిన అంకెలను ఉపయోగించి ఆమె ఒక లాటరీ టిక్కెట్ కొంది. అయితే రెండు రోజులకే ఆమె లాటరీలో గెలిచినట్లు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. కానీ దాన్ని చూసిన ఎడ్వర్డ్స్.. నకిలీ మెసేజీ అనుకుంది. కానీ ఆ తర్వాత అది నిజమని తెలుసుకుని ఆశ్చర్యపోయింది. వాస్తవానికి ఆమె గెలిచిన బహుమతి 50,000 డాలర్లు. కానీ అదనంగా ఒక డాలరు చెల్లించి ‘పవర్ ప్లే’ ఆప్షన్‌ను ఎంచుకోవడం వల్ల ఆమె గెలుచుకున్న మొత్తం ఏకంగా మూడు రెట్లు పెరిగి 1,50,000 డాలర్లు , భారత కరెన్సీలో సుమారు 1.32 కోట్ల రూపాయలైంది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు గెలుచుకున్న ఎడ్వర్డ్స్.. ఈ మొత్తాన్ని దానంగా ఇవ్వాలని నిర్ణయించింది. వెంటనే మూడు వేర్వేరు సంస్థలకు విరాళంగా ఈ డబ్బును ఇచ్చేసింది. మొదటి విరాళాన్ని మతి మరుపు సమస్యలతో బాధ పడుతున్న వారికి సాయం చేస్తున్న సంస్థకు ఇచ్చింది. ఎడ్వర్డ్స్ భర్త కూడా ఇదే సమస్యతో ప్రాణాలు కోల్పోయారు. అలాగే రెండో విరాళాన్ని ఆహార అభద్రతను తొలగించి, స్థానిక ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించడానికి పని చేసే సంస్థకు అందించింది. ఇక మూడో విరాళాన్ని నేవీ-మెరైన్ కార్ప్స్ రిలీఫ్ సొసైటీకి విరాళంగా సమర్పించింది. తండ్రి జ్ఞాపకార్థం ఈ విరాళం ఇచ్చి మానవత్వాన్ని చాటుకుంది ఎడ్వర్డ్స్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sink Hole: నడిరోడ్డుపై పేద్ద.. గొయ్యి.. పదుల సంఖ్యలో పడ్డ వాహనాలు
గ్యాస్ బండ పేలితే.. పరిహారం చెల్లించాల్సిందే
కన్న కూతురినే.. కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు కారణం తెలిసి అంతా షాక్
ఒంటిమిట్టలో అద్భుతం..600 అడుగుల రామయ్య విగ్రహం
Venezuela Earthquake: భారీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం