Telangana: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు భలే గుడ్ న్యూస్.. ఇది కదా కావాల్సింది

Telangana: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు భలే గుడ్ న్యూస్.. ఇది కదా కావాల్సింది


ఇంటి నిర్మాణ ఖర్చులు పెరగడంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలకు దిగింది. ఇప్పటికే ప్రతి లబ్ధిదారునికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోన్న ప్రభుత్వం.. ఇప్పుడు ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు, వ్యయాన్ని తగ్గించేందుకు మరిన్ని సదుపాయాలు కల్పిస్తోంది. కూలీల కొరత, పెరిగిన ఖర్చులు, లబ్ధిదారుల ఇబ్బందులు ఉన్న క్రమంలో.. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను ఉపాధి హామీ పథకంతో అనుసంధానించాలని నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ శాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఇళ్ల నిర్మాణానికి 90 రోజులు ఉపాధి పనులుగా గుర్తింపు లభిస్తుంది. రోజుకు రూ.307 చొప్పున కూలీలకు చెల్లింపు జరగనుంది. దీంతో మొత్తం 90 రోజులకు కూలీలకు సుమారు రూ.27,630 వరకు ఆదాయం కలుగుతుంది. బేస్‌మెంట్‌ పనులకు 40 రోజులు, స్లాబ్‌ పనులకు 50 రోజులు ఉండేలా పనుల స్పష్టంగా నిర్ణయించారు. ఎంపీడీవోలు ముందుగా అర్హులైన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారుల అనుమతి తీసుకోవాలి. ఆ జాబితాను గృహనిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్‌కు పంపాలి. ఉపాధి పనులు పూర్తయ్యాకనే ఇతర పనులు చేపట్టాలని ఆదేశించారు. ఇంటి నిర్మాణ పురోగతిని పూర్తిగా పర్యవేక్షించేందుకు మూడు దశల్లో ఫొటోలు అప్‌లోడ్ చేయాలి. ప్రారంభ దశలో, మధ్య దశలో, పూర్తి అయిన తర్వాత ఫొటోలతో పాటు లబ్ధిదారుల ఫొటో కూడా ఉండాలి. పనులు పూర్తయిన తర్వాత పంచాయతీ కార్యదర్శి ధృవీకరిస్తే మాత్రమే చెల్లింపులు జరుగుతాయి.

చెల్లింపుల వివరాలు, లబ్ధిదారుల జాబితాను పంచాయతీ నోటీస్‌ బోర్డుపై ప్రదర్శించాలి. అంతేకాకుండా.. ప్రత్యేక రిజిస్టర్ రెడీ చేసి సామాజిక తనిఖీల సమయంలో అందుబాటులో ఉంచాలి. ఈ నిర్ణయం వల్ల కూలీలకు పనులు లభిస్తాయి. జాబ్‌కార్డు కలిగిన లబ్ధిదారులు డబుల్ ప్రయోజనం పొందుతారు. నిర్మాణ పనులు ఆలస్యం కాకుండా వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఇళ్ల నిర్మాణంలో ఉపయోగించే ప్రధాన పదార్థాలైన సిమెంట్, స్టీల్‌ జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. గతంలో జీఎస్టీ 28% ఉండగా.. ప్రస్తుతం 18%కు తగ్గించారు. ఈ నిర్ణయం వల్ల నిర్మాణ ఖర్చు బాగా తగ్గి, లబ్ధిదారులపై పడే ఆర్థిక భారం తగ్గనుంది.

ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయడం, సిమెంట్‌-స్టీల్‌ పన్ను తగ్గించడం వంటి చర్యలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడమే కాకుండా లబ్ధిదారులకు ఊరట దక్కనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *