గ్యాస్‌ బండ పేలితే.. పరిహారం చెల్లించాల్సిందే

గ్యాస్‌ బండ పేలితే.. పరిహారం చెల్లించాల్సిందే


ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ గ్యాస్‌ సిలిండర్ల వల్ల ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతుంటాయి. అలా ప్రమాదం జరిగితే వినియోగదారులకు బీమా వస్తుందన్న సంగతి మీకు తెలుసా? అవును, గ్యాస్‌ సిలిండర్‌ పేలి ప్రమాదం జరిగగితే రూ.50 లక్షల వరకూ బీమా వస్తుంది. దీనికోసం మనం ఎలాంటి రుసుము చెల్లించనక్కర్లేదు. మీరు గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసినప్పటినుంచి బీమా వర్తించడం మొదలవుతుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. ఈ బీమా పొందాలంటే, సిలిండర్‌ పేలి ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌, ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌, ఏజెన్సీకి సమాచారం అందించాలి. వారు వచ్చి ప్రమాద ఘటనపై విచారణ జరుపుతారు. సిలిండర్‌ పేలడంవల్లే ప్రమాదం జరిగిందని భావిస్తే.. వారు సంబంధిత ఆయిల్‌ కంపెనీ, బీమా సంస్థకు డిస్ట్రిబ్యూటర్‌ సమాచారం అందిస్తారు. ప్రమాదంలో ఎవరయినా చనిపోతే, బీమా పొందేందుకు మరణ ధ్రువీకరణ పత్రం, పోస్టుమార్టం నివేదిక, చికిత్సకు సంబంధించిన మెడికల్‌ బిల్లులు, రసీదులు సమర్పించాల్సి ఉంటుంది. 2019లోనే లోక్‌సభలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఎల్‌పీజీ పేలుడు బాధితులకు బీమా అందిస్తున్నట్లు తెలిపారు. సిలిండర్‌ పేలిన ప్రమాదంలో కేవలం ఆస్తి నష్టం జరిగితే రూ.2 లక్షలు బీమా వస్తుంది. ప్రమాదంలో ఎవరైనా మృతి చెందితే వ్యక్తిగత ప్రమాద బీమా రూ.6 లక్షలు లభిస్తాయి. ప్రమాదం గాయపడి చికిత్స పొందుతున్న ఒక్కో సభ్యుడికి రూ.2 లక్షలు బీమా వస్తుంది. కుటుంబం మొత్తానికి గరిష్ఠంగా రూ. 50 లక్షల వరకూ బీమా లభిస్తుంది. అయితే ప్రమాదం జరిగిన తక్షణమే స్థానిక డిస్ట్రిబ్యూటర్‌కు సమాచారం అందించాలి. దీంతో పాటు 1906కు కూడా ఫోన్‌ చేసి వివరాలు చెప్పాలి. డిస్ట్రిబ్యూటర్‌లు సంబంధిత గ్యాస్‌ కంపెనీలకు సమాచారం ఇస్తారు. సదరు కంపెనీ ప్రతినిధులు వచ్చి పరిశీలించి వివరాలు నమోదు చేసుకుని, తదుపరి చర్యలు చేపడతారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కన్న కూతురినే.. కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు కారణం తెలిసి అంతా షాక్‌

ఒంటిమిట్టలో అద్భుతం..600 అడుగుల రామయ్య విగ్రహం

Venezuela Earthquake: భారీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

పట్టపగలు దారిదోపిడీ..ఏకంగా కోట్ల విలువైన బంగారం దోచేశారు

పద్ధతి మార్చుకోమన్న పై అధికారిని బెల్టుతో కొట్టిన హెడ్మాస్టర్‌.. కారణం ఇదే



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *