పట్టపగలు దారిదోపిడీ..ఏకంగా కోట్ల విలువైన బంగారం దోచేశారు

పట్టపగలు దారిదోపిడీ..ఏకంగా కోట్ల విలువైన బంగారం దోచేశారు


అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే భారత్‌ మండపం సమీపంలో కొందరు దుండగులు దారికాచి రూ.కోటి విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు. బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దిల్లీకి చెందిన శివమ్‌కుమార్‌ యాదవ్‌, రాఘవ్‌, సుమారు కోటిరూపాయల విలువైన బంగారు ఆభరణాలను దుకాణంలో ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగులను తీసుకొని తమ ద్విచక్రవాహనంపై చాందినీ చౌక్‌ నుంచి భైరాన్‌ మందిర్‌కు బయల్దేరారు. అక్కడి నగల దుకాణంలో వీటిని ఇచ్చేందుకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఇద్దరు దుండుగులు బైక్‌పై వచ్చి వారిని అడ్డుకున్నారు. అందరూ చూస్తుండగానే తుపాకీతో బెదిరించి వారి వద్ద ఉన్న నగల బ్యాగులను లాగేసుకుని పారిపోయారు. ఊహించని ఘటనతో షాక్‌తిన్న శివకుమార్‌, రాఘవ్‌ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. 500 గ్రాముల బంగారం, దాదాపు 35 కిలోల వెండి ఆభరణాలను దుండగులు దోచుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. మార్కెట్‌లో వీటి విలువ రూ.కోటి పైనే ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పద్ధతి మార్చుకోమన్న పై అధికారిని బెల్టుతో కొట్టిన హెడ్మాస్టర్‌.. కారణం ఇదే

అమ్మో కోతి.. రైతు చెవి కొరికి తీసుకుపోయిన మర్కటం

Weather Update: హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన10 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్

గ్రూప్-1 రిజల్ట్స్.. ఎస్సీ స్టడీ సర్కిల్‌కి 30 ర్యాంకులు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *