తాజాగా దక్షిణ అమెరికాలోని వెనిజులాలో భారీ భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 6.2 తీవ్రతతో భారీ ప్రకంపనలు వచ్చాయి. జులియా రాష్ట్రంలోని మెనేగ్రాండే ప్రాంతానికి తూర్పు-ఈశాన్య దిశలో 24 కిలోమీటర్ల దూరంలో, రాజధాని కారకాస్‌కు పశ్చిమాన 600 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్ర ఉన్నట్టు కొలంబియన్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూ అంతర్భాగంలో 7.8 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. భూకంప తీవ్రతతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. వెనిజులాలోని ప్రధాన నగరాలైన కారకాస్, మారాకైబోతోపాటు పొరుగున ఉన్న కొలంబియా, కరీబియన్ నెదర్లాండ్స్, కరసౌ, అరుబాలతోపాటు మొత్తం ఆరు దేశాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ముఖ్యంగా వెనిజులా, కొలంబియాలో భూకంప తీవ్రత ఎక్కువగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పట్టపగలు దారిదోపిడీ..ఏకంగా కోట్ల విలువైన బంగారం దోచేశారు
పద్ధతి మార్చుకోమన్న పై అధికారిని బెల్టుతో కొట్టిన హెడ్మాస్టర్.. కారణం ఇదే
అమ్మో కోతి.. రైతు చెవి కొరికి తీసుకుపోయిన మర్కటం
Weather Update: హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
గ్రూప్-1 రిజల్ట్స్.. ఎస్సీ స్టడీ సర్కిల్‌కి 30 ర్యాంకులు