పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించినా.. ఆటోలు, ఇతర వాహనాలు లెక్కచేయడంలేదు. ప్రైవేటు వాహనదారులు లాభాపేక్షతో ఇష్టారాజ్యంగా ప్రయాణికులను ఎక్కిస్తుంటారు. పరిమితికి మించి ప్రయాణికులతో పాటు మితిమీరిన వేగం.. మరీ ముఖ్యంగా విద్యార్థుల ప్రాణాలతో ఆటోవాలాలు చెలగాటం అడుతున్నారు. ఇలా మునుగోడు నియోజకవర్గంలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని నారాయణపూర్ నుండి చౌటుప్పల్ వస్తున్న ఆటో డ్రైవర్ కి క్లాస్ పీకారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
మునుగోడు నుండి చౌటుప్పల్ వస్తున్న రాజగోపాల్ రెడ్డికి అతివేగంగా వస్తున్న ఆటో కంటపడింది. చిన్నపిల్లలు మహిళలతో పరిమితికి మించి ప్రయాణం చేస్తున్న ఆటోను గమనించారు. చౌటుప్పల మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి శివారు వద్ద ఆపారు. ఏదైనా జరగరానిది జరిగితే చిన్నపిల్లలు మహిళలు ప్రాణాలు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. మరోసారి ఇలా పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే బాగోదని ఆటో డ్రైవర్‌కు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..