తాజాగా తెలంగాణలోని ములుగు జిల్లాలో కోతులు రెచ్చిపోయాయి. ఒంటరిగా ఉన్న ఓ వ్యక్తిపై దాడిచేసి అతని చెవిని కొరికి పట్టుకొని పోయాయి. కోతుల దాడిలో ఎడమ చెవిని కోల్పోయిన ఆ బాధితులు తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలో చేరాడు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవాపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికుల్లో భయాందోళన రేకెత్తించింది. స్థానికంగా ఉండే రాజు అనే రైతు తన ఇంటి ముందు పని చేసుకుంటున్నాడు. అదే సమయంలో అటుగా ఓ కోతుల గుంపు వచ్చింది. అవి ఇళ్లలోకి ఎక్కడ చొరబడతాయోనని భావించిన రాజు కోతులను తరిమే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కోతుల గుంపు ఒక్కసారిగా అతడి మీద దాడికి తెగబడింది. ఈ క్రమంలో అతడు కిందపడిపోగా, అతని చెవిని కొరికేసి, ఆ చెవిని పట్టుకొని పారిపోయాయి. దీంతో బాధితుడు తీవ్రమైన భయంతో కేకలు వేయగా, స్థానికులు అతడిని ఆసుపత్రిలో చేర్చారు. తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రికి వచ్చిన రాజును చూసి.. డాక్టర్లు సైతం షాకయ్యారు. రాజు ప్రస్తుతం ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవలి కాలంలో కోతుల దాడిలో పలువురు గాయాలపాలవుతున్నారని, ఇకనైనా అటవీ శాఖ అధికారులు చొరవ తీసుకుని, ఏదైనా పరిష్కారం చూపాలని గ్రామస్తులు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Weather Update: హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
గ్రూప్-1 రిజల్ట్స్.. ఎస్సీ స్టడీ సర్కిల్‌కి 30 ర్యాంకులు