సినీరంగంలోకి అనుహ్యంగా ఎంట్రీ ఇచ్చి తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. అందులో మనోజ్ ఒకరు. భారతిరాజా దర్శకత్వం వహించిన మన్వాసనై అనే చిత్రం 1983లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతోనే నటి రేవతి, పాండియన్ తమిళంలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే తమ నటనతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఈ మూవీలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా, ‘పోతి వచ్చా మల్లికా మొట్టు’ పాట ఇప్పటికీ పాపులర్. అయితే ఈ సినిమాలో నటించిన నటీనటులకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వైరలవుతుంది.
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తగ్గని క్రేజ్.. ఈ బ్యూటీ ఎవరంటే..
మలయాళ నటుడు మనోజ్ కె జయన్ దర్శకుడు భారతీరాజా ‘మన్వాసనై’ చిత్రం కోసం నటుడు పాండియన్‌ను ఎలా ఎపిక చేశారో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, “మన్వాసనై చిత్రం కోసం మధురైకి వెళుతున్నప్పుడు, దర్శకుడు భారతీరాజా ఎంచుకున్న ప్రధాన నటుడు అనారోగ్యానికి గురయ్యాడు. అతని స్థానంలో కొత్త నటుడిని నియమించాల్సి వచ్చింది. రెండు రోజులు షూటింగ్ లేదు. అందరూ మధురై మీనాక్షి అమ్మన్ ఆలయానికి వెళ్ళారు. ఆలయ ప్రాంతంలో ఉన్న ఒక గాజుల దుకాణానికి వెళ్ళారు. అక్కడ ఒక అబ్బాయి పనిచేస్తున్నాడు. అతడిని చూడగానే వెంటనే సినిమా కోసం తీసుకుంటున్నామని అన్నారు” అంటూ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..
పాండియన్ తమిళంలో మొత్తం 75 చిత్రాలకు పైగా నటించాడు.తన నటనతో జనాలకు దగ్గరయ్యాడు. పాండియన్ 1960లో జనవరి 5న తమిళనాడులో విరుదునగర్ లో జన్మించారు. మధురైలో తన తండ్రితో కలిసి గాజుల దుకాణంలో ఉండగా. డైరెక్టర్ భారతీరాజా ఆయనను చూసి సినిమాలో అవకాశం ఇచ్చారు. ఇండస్ట్రీలో కొన్నాల్లుపాటు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన పాండియన్ 48 ఏళ్ల వయసులో కాలేయ వ్యాధితో 2008 జనవరి 10న మరణించారు.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..