స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టేవాళ్లు లేదా మామూలుగా బంగారం లేదా వెండి కొనుగోలు చేసేవాళ్లు.. ఇలా అందరూ ఇప్పుడు సందిగ్ధంలో ఉన్నారు. బంగారం/వెండి కొనాలా వద్దా? అని.. అయితే దీని గురించి నిపుణులు ఏమంటున్నారు? బంగారం, వెండిలో ఏవరికి ఏది మంచిదో ఇప్పుడు చూద్దాం.
బంగారం ఎవరికి?
నిపుణుల సూచనల ప్రకారం ధరలు పెరిగినా తగ్గినా.. బంగారం కొనుగోలు చేయడం ఎప్పుడూ మంచిదే. ముఖ్యంగా ఫైనాన్షియల్ సేఫ్టీ కోరుకునేవారు బంగారాన్ని ఒక స్థిరమైన పెట్టుబడిగా భావించొచ్చు. లాంగ్ టర్మ్ లో లాభాలు ఆశించేవాళ్లకు కూడా బంగారం మంచి పెట్టుబడి ఆప్షన్ కింద పనికొస్తుంది. ముఖ్యంగా మనదేశంలో తరతరాలుగా కుటుంబాలు దీనిని సంపద, భద్రతకు చిహ్నంగా భావిస్తుంటాయి. కాబట్టి మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా బంగారం కొనడం అనేది మంచి పెట్టుబడి విధానంగా పరిగణించొచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.
అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలినా, ద్రవ్యోల్బణం పెరిగినా, కరెన్సీ విలువ తగ్గినా.. ఇలా ఎలాంటి పరిస్థితుల్లో అయినా బంగారం ఒక సేఫ్ ఆప్షన్ గా పనికొస్తుంది. ఇదొక దీర్ఘకాలిక సంపదగా ఉంటుంది.
వెండి ఎవరికి
ఇక వెండి విషయానికొస్తే.. దీని లెక్క వేరు. వెండిని పరిశ్రమల్లో కూడా వాడతారు. కాబట్టి దీని డిమాండ్ త్వరత్వరగా మారుతుంటుంది. అయితే ఇది కూడా బంగారం లాగా స్థిరమైన విలువ కలిగి ఉంటుంది. వెండి ధరల్లో మార్పులు వస్తున్నప్పటికీ లాంగ్ టర్మ్ లో దీని డిమాండ్ కూడా పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. అంతేకాదు, ఒకవేళ పారిశ్రామిక డిమాండ్ బలంగా ఉంటే కొన్ని సార్లు ఇది తక్కువ టైంలోనే ఎక్కువ లాభాన్ని ఇవ్వగలదు. కాబట్టి తక్కువ మొత్తంతో పెట్టుబడి పెట్టాలనుకునేవాళ్లు వెండిలో పెట్టుబడులు పెట్టొచ్చు.
ఏదైనా ఓకే
వెండి లేదా బంగారం ఏది కొనాలి అని డిసైడ్ అయ్యేముందు ఈ విషయాన్ని గమనించుకోవాలి. లాంగ్ టర్మ్ లో చూసుకుంటే రెండిటితో లాభాలే తప్ప నష్టాలు ఉండవు. అయితే కేవలం లాంగ్ టర్మ్ లో లాభాలు కావాలి అనుకునేవాళ్లు, సేఫ్టీ కోరుకునేవాళ్లు బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిది. అలాకాకుండా కొంత రిస్క్ తీసుకుని తక్కువ టైంలో లాభాలు ఆశించేవాళ్లు వెండిని ఎంచుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి