ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ సంచలన ఆరోపణలు చేశారు. మదర్ డెయిరీ ఎన్నికల్లో తమ జిల్లా నేతలు కొందరు BRSతో పొత్తుపెట్టుకున్నారని మండిపడ్డారు. బంధుత్వాల కోసం కాంగ్రెస్‌ను బలిచేయొద్దని విమర్శించారు. మదర్ డెయిరీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కానీ గెలిస్తే నైతిక బాధ్యత వహిస్తూ బీర్ల ఐలయ్య రాజీనామా చేయాలన్నారు. కాంగ్రెస్ ఓడితే నేతలకు కార్యకర్తలే బుద్ధిచెబుతారన్నారు. ఇప్పటివరకు వరంగల్ కాంగ్రెస్‌లో నెలకొన్న కుంపట్లు నల్లగొండ జిల్లాకు పాకినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యపై సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే మందుల సామేల్ చేసిన ఆరోపణలు కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. . మదర్ డెయిరీ ఎన్నికల్లో తమ జిల్లా నేతలు కొందరు BRSతో పొత్తుపెట్టుకున్నారన్న సామేల్.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నైతిక బాధ్యత వహిస్తూ బీర్ల ఐలయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం సంచలనంగా మారింది.
జిల్లాలోని మదర్ డైరీ ఎన్నికలు ఈ మొత్తం వ్యవహారానికి కారణంగా తెలుస్తోంది. ఈనెల 27న ఎన్నికలు జరగనున్న మూడు డైరెక్టర్ల స్థానాల్లో రెండు చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు, ఒక చోట బీఆర్‌ఎస్ మద్దతుదారులను గెలిపించుకునేలా ఒప్పందం జరిగిందనే ఊహాగానాలు మందుల సామేల్‌కు ఆగ్రహం తెప్పించాయి. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని రెండు జనరల్ డైరెక్టర్ స్థానాలకు ఐదుగురు పోటీ పడుతున్నారు. వీరిలో మంచాల ప్రవీణ్‌రెడ్డికి ఎమ్మెల్యే మందుల సామేల్ మద్దతు ప్రకటించారు. అయితే జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు.. ఒక డైరెక్టర్ పదవి కోసం బీఆర్ఎస్ నేతలతో ఒప్పందం కుదుర్చుకున్నారనే ప్రచారంపై సామేల్ మండిపడుతున్నారు.