ఇదెక్కడి న్యాయం.. జొమాటోలో ఆర్డర్‌ చేసి వెంటనే క్యాన్సల్‌ చేసినందుకు రూ.670లు వసూలు!

ఇదెక్కడి న్యాయం.. జొమాటోలో ఆర్డర్‌ చేసి వెంటనే క్యాన్సల్‌ చేసినందుకు రూ.670లు వసూలు!


నగరాల్లో చాలామంది ఫుడ్‌ డెలవరీ యాప్‌లపై విపరీతంగా ఆధారపడుతున్నారు. కస్టమర్ల డిమాండ్‌ చూసి.. ఫుడ్‌ డెలవరీ యాప్‌లు ఇదే అదునుగా కొన్ని సందర్భాల్లో ప్రజలను దోచుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఓ ఘటన వెలుగు చూసింది. దివ్య శర్మ అనే ఓ యువతి జొమాటోలో సెప్టెంబర్ 22న ఐస్ క్రీం చీజ్ కేక్ కోసం ఆర్డర్ ఇచ్చింది. కానీ భారీ వర్షం, డెలివరీ సమయం పెరగడం వల్ల 10 నిమిషాల్లోనే తన ఆర్డర్‌ను రద్దు చేసుకుంది.

ఆర్డర్‌ క్యాన్సల్‌ చేసిన తర్వాత ఆమె తన రీఫండ్‌ కోసం చూడగా.. డబ్బు రీఫండ్‌ కాలేదు. ఏంటని జొమాటో కస్టమర్‌ కేర్‌ను సంప్రదిస్తే.. డెలవరీ పార్ట్నర్‌ అసైన్‌ చేసే ప్రయత్నాల కోసం రూ.670లు ఛార్జీగా వసూలు చేసినట్లు కంపెనీ తెలిపింది. దీంతో షాక్‌ అయిన యువతి.. ఆ విషయాన్ని సోషల్‌ మీడియాలో పెట్టేసింది. నేను రూ.670లతో ఐస్‌క్రీమ్‌ చీజ్‌ కేక్‌ ఆర్డర్‌ చేసి.. భారీ వర్షం, డెలవరీ టైమ్‌ 35 నిమిషాల నుంచి 50 నిమిషాలకు పెరగడంతో ఆర్డర్‌ క్యాన్సల్‌ చేసినట్లు ఆమె తెలిపారు.

అప్పటి ఇంకా డెలవరీ పార్ట్నర్‌ను అసైన్‌ చేయలేదు, ఫుడ్‌ రెడీ కాలేదు.. కేవలం 10 నిమిషాల తర్వాత ఆర్డర్‌ క్యాన్సల్‌ చేసినందుకు మొత్తం డబ్బు తీసుకోవడాన్ని ఆమె దొంగతనంగా అభివర్ణించింది. ఆమె పోస్ట్‌పై స్పందించిన జొమాటో ఆమె ఐడీని డీఎం చేయమని, సమస్యను పరిష్కారిస్తామని చెప్పంది. ఆ తర్వాత ఆ డబ్బు రీఫండ్‌ అయినట్లు తెలుస్తోంది. ఆమె ఆ విషయాన్ని సోషల్‌ మీడియాలో పెట్టుకుంటే కంపెనీ రీఫండ్‌ చేసేది కాదు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *