సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్ మూవీ నరసింహా. తమిళంలో పడయప్ప పేరుతో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగులో నరసింహా పేరుతో రిలీజ్ చేశారు. తెలుగు, తమిళంలో భాషలలో ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు.. ఈ సినిమాలోని మ్యూజిక్ సైతం సూపర్ హిట్ అయ్యింది. ఇందులో రజినీకాంత్, సౌందర్య, రమ్యకృష్ణ, నాజర్, ప్రకాష్ రాజ్, అబ్బాస్ కీలకపాత్రలు పోషించారు. ఇందులో శివాజీ గణేషన్ సైతం కనిపించారు. అప్పట్లో ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. ఇందులో విలన్ పాత్రలో రమ్యకృష్మ అదరగొట్టింది. నీలాంబరి పాత్రకు ప్రాణం పోశారు. ఎ.ఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ గురించి ఇంక చెప్పక్కర్లేదు.
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తగ్గని క్రేజ్.. ఈ బ్యూటీ ఎవరంటే..
అయితే ఈ సినిమాలో రజినీకాంత్, సౌందర్య దంపతుల పెద్ద కుమార్తె పాత్రలో నటి ప్రీతి విజయకుమార్ నటించగా.. చిన్న కూతురిగా అనిత వెంకట్రామన్ నటించారు. ఈ సినిమాలో ఆమె పాత్ర కాసేపు ఉన్నప్పటికీ అమాయకమైన నటనతో ఆకట్టుకుంది. అనితా వెంకట్రామన్ విషయానికి వస్తే.. 13 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మణిరత్నం నిర్మించిన ఇరువర్ చిత్రంలో రేవతి, ప్రకాష్ రాజ్ దంపతుల కూతురిగా కనిపించింది. ఆ తర్వాత నరసింహా సినిమాలో రజినీ కూతురిగా కనిపించింది. వరిగా అన్బుతన్ అనే చిత్రంలో నటించిన అనితా వెంకట్ తన చదువు కోసం నటనకు విరామం తీసుకుంది. 30 ఏళ్ల వయసులో తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..
శివశంకర్ అనే సీరియల్ ద్వారా ఆమె బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఆ మధ్య కాంచన 2లో నటించిన అనిత ఎక్కువగా సీరియల్స్ చేస్తుంది. తమిళంలో సరస్వతియం సీరియల్లో అనిత సరస్వతి పాత్రకు తల్లిగా కనిపించింది. ఇందులో నటించిన హీరో దీపక్ కంటే అనిత చాలా చిన్నది. అయినప్పటికీ తల్లి పాత్రలు పోషిస్తుంది. ప్రస్తుతం ఆమె తమిళంలో సీరియల్స్ చేస్తుంది.
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?