అందరి హీరోలకు అభిమానులు ఉంటారు.. కానీ స్టార్ హీరోలను కూడా అభిమానులుగా మల్చుకున్న ఘనత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కే దక్కుతుంది. కేవలం తెలుగులోనే కోలీవుడ్, బాలీవుడ్, శాండల్ వుడ్ ఇండస్ట్రీలోనూ చాలా మంది నటులు పవన్ ను అమితంగా అభిమానిస్తారు. ఈ క్రమంలో ఒక కోలీవుడ్ క్రేజీ హీరో ఓజీ సినిమా చూసేందుకు చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాడు. నగరంలోని ప్రముఖ విమల్ థియేటర్ లో ఓజీ సినిమాను ఆస్వాదించాడు. అభిమానుల్లో కలిసి పోయి సినిమాను ఎంజాయ్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘నేను హైదరాబాద్ రావడానికి ఒకే కారణం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ సినిమాని చూడటానికి. ఆ మాస్ అనుభవాన్ని తెలుగు వాళ్లతో కలిసి పంచుకోడానికి’ అని ట్వీట్ చేసాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఈ తమిళ్ హీరో వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ఇంతకీ పవన్ సినిమా చూసేందుకు చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన ఆ తమిళ హీరో మరెవరో కాదు లవ్ టుడే, డ్రాగన్.. సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ కొట్టిన ప్రదీప్ రంగనాథన్. గురువారం (సెప్టెంబర్ 25) సాయంత్రం చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రదీప్ విమల్ థియేటర్లో OG సినిమా చూసారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశాడు. త్వరలో ప్రదీప్ డ్యూడ్ అనే సినిమాతో రాబోతున్నాడు.
అంతకు ముందు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఇదే విమల్ థియేటర్ లో ఓజీ సినిమాను ఆస్వాదించారు. సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అకీరా నందన్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హరీశ్ శంకర్, నిర్మాత ఎస్కేఎన్, సిరి తదిరులు పవన్ సినిమాను ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట బాగా వైరలయ్యాయి. ఇక సుజిత్ తెరకెక్కించిన ఓజీ సినిమా మొదటి రోజు ఓవరాల్ గా రూ. 100 కోట్లకు పైగా కలెకన్లు రాబట్టిందని టాక్.
ఇవి కూడా చదవండి
హైదరాబాద్ విమల్ థియేటర్ లో హీరో ప్రదీప్ రంగనాథన్.. వీడియో..
Nenu ippudu Hyderabad raavadaniki oke kaaranam #PowerStar #OG choodataaniki maathrame…ee mass experience ni telugu vaallatho chooddame kadha mass pic.twitter.com/E3L4amiht6
— Pradeep Ranganathan (@pradeeponelife) September 25, 2025
FANBOY ❤️🔥❤️🔥❤️🔥
Celebrated in style with the iconic red towel at Vimal Theatre 💥#OG #TheyCallHimOG #BoxOfficeDestructorOG pic.twitter.com/2WjBk1yE6E— DVV Entertainment (@DVVMovies) September 25, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.