
పై ఫొటోలో ఉన్న బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇప్పుడు ఆ పిల్లాడు సినిమా ఇండస్ట్రీలో సెన్సేషన్. ప్రస్తుతం ఎక్కడ చూసినా అతని పేరే వినిపిస్తోంది. సోషల్ మీడియా కూడా అతని నామస్మరణతో మార్మోగిపోతోంది. అన్నట్లు ఈ అబ్బాయిది రాయల సీమ. అనంతపురం జిల్లాలో పుట్టి పెరిగాడు. చదువుల్లోనూ బాగా చురుకు. సీఏ కోర్సులో కూడా చేరాడు. అయితే చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి పెంచుకున్నాడు. అందుకే చదువుకుంటోన్న సమయంలోనే ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీలో డిగ్రీ పూర్తి చేశాడు. కోర్సు పూర్తయిన తర్వాత షార్ట్ ఫిల్మ్స్ తీయాలనుకున్నాడు. కానీ కెమెరా కొనుక్కోవడానికి చేతిలో డబ్బులు లేవు. కానీ బిడ్డ కలను సాకారం చేయడానికి అతని తల్లి తన బంగారం తాకట్టు పెట్టి 44 వేల రూపాయలు తెచ్చి ఇచ్చింది. వాటితో ఒక మంచి సోనీ బ్రాండ్ కెమెరా కొనిపెట్టింది. అంతే తల్లి కొనిచ్చిన కెమెరాతో షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 లఘు చిత్రాలు రూపొందించాడు. యూట్యూబ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆ తర్వాత తన షార్ట్ ఫిల్మ్స్ టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు చూపించాడు. వాటిని చూసిన పూరి.. ‘నీవు ఎవరి దగ్గరా అసిస్టెంట్ గా పని చేయాల్సిన అవసరం లేదు. నువ్వే సినిమా తీయగలవు’.. అంటూ ఎంకరేజ్ చేశాడు.. కట్ చేస్తే.. అతను ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సెన్సేషన్ అయ్యాడు. చిన్న వయసులోనే ప్రభాస్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేశాడు. ఈ పాటికే అర్థమై ఉటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. అతను మరెవరో కాదు ఓజీ సినిమా డైరెక్టర్ సుజిత్.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో డైరెక్టర్ సుజిత్..
View this post on Instagram
సుమారు 30కు పైగా లఘు చిత్రాలను తెరకెక్కించిన సుజిత్ 2014లో రన్ రాజా రన్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. రెండో సినిమా సాహోతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు ఓజీ సినిమాతో మరిన్ని రికార్డులు బద్దలు కొడుతున్నాడు.
ప్రభాస్ తో ఓజీ డైరెక్టర్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.