కరివేపాకు వల్ల తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. అయితే జ్యోతిషశాస్త్రంలో కూడా కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉందని తెలుసా? అందుకే కరివేపాకు మొక్కని ఇంట్లో పెంచుకోవాలంటే కొన్ని నియమాలను పాటించాలి. ఆనందం, శ్రేయస్సు కోసం కరివేపాకు మొక్కను ఇంట్లో ఏ దిశలో పెంచుకోవాలి? ఎక్కడ నాటితే శుభప్రదంగా పరిగణించబడుతుంది తెలుసుకోండి.
కరివేపాకు మొక్క బాగా పెరగితే అది లక్ష్మీదేవి ఆశీర్వాదంగా భావిస్తారు. అయితే.. ఇంట్లో కొన్ని ప్రదేశాలలో కరివేపాకులను నాటడం ఎంత శుభప్రదమో.. కొన్ని ప్రదేశాల్లో పెంచడం వల్ల హాని కలుగుతుంది. ఒకొక్కసారి మరణం కూడా సంభవించవచ్చు. ఇది ముఖ్యంగా ఇంటి యజమానికి హానికరం. ఇంట్లో రెండు ప్రదేశాలలో కరివేపాకులను పెంచడం వల్ల శ్రేయస్సు వస్తుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి పశ్చిమ దిశను చంద్రుని దిశగా పరిగణిస్తారు. ఈ దిశలో ఏదైనా ఇంటి మొక్కను నాటడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. ఈ దిశలో కరివేపాకు మొక్కను నాటడం వల్ల వ్యక్తి ఆరోగ్యం బాగుంటుంది.
కరివేపాకు మొక్కను ఇంటి దక్షిణం వైపున పెంచడం కూడా మంచిది. సంపద, శ్రేయస్సు పొందవచ్చు. అయితే కరివేపాకు మొక్కను ఇంటిలో పడమర, దక్షిణ ఇలా ఏ దిశలో పెంచినా.. ఇంటికి దగ్గరగా పెంచవద్దు. ఇంటి నుంచి కనీసం నాలుగు అడుగుల దూరంలో పెంచడం ఉత్తమం.
ఇంటి తోటలో కరివేపాకు మొక్కను నాటడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి ఆనందం, అదృష్టం కూడా లభిస్తుందని చెబుతారు.
వాస్తు నిపుణుల సలహా ప్రకారం కరివేపాకు మొక్కని ఎప్పుడూ పెంచకూడని ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో ఒకటి ఈశాన్య మూల ఒకటి. ఈ ప్రాంతంలో కరివేపాకు మొక్కని పెంచితే ఇంటిలో నివసించే మనుషులు ఒకదాని తర్వాత ఒకటి దురదృష్టకరమైన సంఘటనలు ఎదుర్కొనాల్సి వస్తుంది. దుఃఖం, కష్టాలు వస్తూనే ఉంటాయి.
అంతేకాదు ఇంటి ప్రధాన ద్వారం సమీపంలో కూడా కరివేపాకు మొక్క పెంచవద్దు. ఇలా చేయడం వలన అప్పుల పాలవుతారు. ఆర్థిక ఇబ్బందులను పడతారు. అంతేకాదు కరివేపాకు మొక్క నుంచి కరివేపాకు సాయం సంధ్యవేళ తర్వాత కోయవద్దు.