Telangana: పశువులను మేతకు తీసుకెళ్లిన భార్యాభర్తలు.. ఎంతకూ ఇంటికి రాకపోగా.. వెళ్లి చూసేసరికి

Telangana: పశువులను మేతకు తీసుకెళ్లిన భార్యాభర్తలు.. ఎంతకూ ఇంటికి రాకపోగా.. వెళ్లి చూసేసరికి


కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్ కారిడార్‌లోని సిర్పూర్ టీ అభయారణ్యంలో రెండు మృతదేహాలు కలకలం రేపాయి. అడవిలోకి పశువులను‌ మేతకు తీసుకెళ్లిన పశువుల కాపారుల దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది‌. పశువులు ఇంటికి చేరినా కాపారులు మాత్రం ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అటవి ప్రాంతంలో పడి ఉన్న రెండు మృతదేహాలను గుర్తించారు. ఒంటిపై రక్తపు మరకలు ఉండటం తలపై అటవి జంతువుల దాడి చేసినట్టుగా గుర్తులు ఉండటంతో పులి దాడి చేసి చంపేసిందా.. లేక ఇతర జంతువులు ఏమైనా దాడి చేసాయా అన్న కోణంలో అటవిశాఖ, పోలీస్ శాఖ సంయుక్తంగా విచారణ చేపట్టారు.

వివరాల్లోకి వెళ్తే..  కొమురంభీం జిల్లా సిర్పూర్ టీ మండలం అచ్చెల్లి గ్రామానికి చెందిన పశువుల కాపరులు దూలం శేఖర్, దూలం సుశీల భార్యా భర్తలు అటవి ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించడం కలకలం రేపింది‌. సిర్పూర్ టీ మండలం భీమన్న అటవి సమీపంలో పశువులను మేతకు తీసుకెళ్లిన భార్యభర్తలిద్దరూ మృతి చెందటం సంచలనంగా మారింది. ఈ ప్రాంతంలో ఎలుగు బంట్ల సంచారం ఎక్కువగా ఉండటం.. పులి సైతం ఇదే ప్రాంతంలో సంచరిస్తుండటంతో ఆ రెండు జంతువుల దాడిలోనే ఈ ఇద్దరు చనిపోయారా అన్నది తేలాల్సి ఉంది.

వారం రోజుల క్రితం ఇదే ప్రాంతంలో పులి, ఎలుగు బంటి సంచరిస్తుందంటూ అటవిశాఖ అధికారులు హెచ్చరికలు‌ సైతం జారీ చేసినట్టు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను సిర్పూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పరిశీలించిన కాగజ్‌నగర్ ఎప్డీవో.. రక్త నమునాలను ల్యాబ్‌కు పంపించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చాకే ఈ ఇద్దరి మృతికి కారణాలు ఏంటో తెలుస్తుందని తెలిపారు కాగజ్ నగర్ ఎప్డీవో శశాంక్. స్థానికులు మాత్రం పులి దాడిలోనే ఆ ఇద్దరు చనిపోయారంటున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *