అంజీర్ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని ప్రతి రోజూ తినడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంటారు ఆరోగ్య నిపుణుల.కానీ కొంత మంది మాత్రం అస్సలే అంజీర్ తినకూడదంట. అయితే అంజీర్ ఎవరు తినకూడదు, ఏ సమస్యలు ఉన్నవారు అంజీర్ తినడం వలన సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు చూద్దాం.
అంజీర్లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ వంటివి ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందువలన ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రతి రోజూ రెండు అంజీర్ పండులు తినాలని చెబుతారు. ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడే వారు క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచిస్తారు.
కానీ ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదే అయనప్పటికీ కొంత మంది మాత్రం వీటికి ఎంత దూరం ఉంటే అంత మంచిదంట. వారు ఎవరంటే? ఎవరైతే డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్నారో వారు అస్సలే అంజీర్ పండ్లు తినకూడదంట. ఎందుకంటే వీటిలో చక్కెర అధికంగా ఉంటుంది. అందువలన రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగే ఛాన్స్ ఉన్నదంట.
అదే విధంగా అలెర్జీ సమ్యలతో బాధపడే వారు కూడా అస్సలే అంజీర్ పండ్లను తినకూడదంట. ఎందుకంటే ఇవి సమస్యను మరింత పెంచే ప్రమాదం ఉంటుంది. అందువలన అలెర్జీలతో బాధపడే వారు, ముఖ్యంగా దురద, దద్దుర్లతో ఇబ్బంది పడే వారు అస్సలే వీటిని తినకపోవడమే మంచిదంట.
అలాగే కాలేయం లేదా కిడ్నీ సమస్యలతో బాధపడే వారు కూడా అస్సలే అంజీర్ పండ్లు తినకూడదంట. ఇవి కిడ్నీ, కాలేయ సమ్యలను మరింత పెంచే ప్రమాదంఉంటుందంట. అందుకే ఈ సమస్యలతో బాధపడే వారు అంజీర్కు ఎంత దూరం ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారంట.అలాగే వీటిని తీసుకున్న వారు కూడా తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. అధికంగా తీసుకుంటే కాల్షియం లోపం, అజీర్తి సమస్యలు, కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు వైద్యుల సలహా మేరకు తీసుకోవడం ఉత్తమం.