
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి వద్ద అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 18 ఏళ్ల ప్రమోద్ కుమార్ నుంచి 1 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తుండగా ఎస్ఓటీ పోలీసులు ఆగపల్లి వద్ద నిందితుడిని పట్టుకున్నారు. ఈ కేసులో ఒడిశాకు చెందిన మరో నిందితుడు కిరణ్ నాయక్ పరారీలో ఉన్నాడు. గంజాయితో సహా పట్టుబడ్డ ప్రమోద్ కుమార్‌ను ఎస్ఓటీ పోలీసులు మంచాల పోలీసులకు అప్పగించారు.