పెంపుడు ఎలుక అని తిట్టిన భార్య.. విడాకులు తీసుకున్న భర్త..! సమర్ధించిన హైకోర్టు..

పెంపుడు ఎలుక అని తిట్టిన భార్య.. విడాకులు తీసుకున్న భర్త..! సమర్ధించిన హైకోర్టు..


ఆ మాటకే అంత ఫీల్‌ అవ్వాలా?.. ఈ మాటను చాలా సార్లు వినే ఉంటారు. కానీ అన్నవారికి అది చిన్నమాటే.. ఆ మట పడ్డవారికి మనసును అది ఎంత గాయపర్చిందో వారికే తెలుస్తుంది. అలా గాయపడిన ఓ భర్త తన భార్యను నుంచి విడాకులు కోరాడు. అందుకే కోర్టు కూడా అంగీకరించింది. ఇంతకీ ఆ భార్య ఏమన్నది తెలిస్తే.. చాలా మంది ఇంత చిన్న మాటకే విడాకులు తీసుకున్నాడా అని అనుకోవచ్చు.. కానీ, పైన చెప్పుకున్నట్లు ఆ మాట అతన్ని ఎంత బాధ పెట్టిందో అతనికే తెలుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సెప్టెంబర్ 3న ఛత్తీస్ గఢ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తల్లిదండ్రుల మాట వింటున్నాడని.. ఓ భార్య తన భర్తను “పాల్తూ చుహా” (పెంపుడు ఎలుక) అని హేళనగా పిలిచేది.

ఆ మాట విని విని ఇక భరించలేక ఆ భర్త విడాకులు కోరాడు. కుటుంబ కోర్టు కూడా విడాకులకు ఓకే చెప్పింది. కానీ, భార్య హైకోర్టుకు వెళ్లింది. కానీ, హైకోర్టు కూడా భర్త వైపే నిలబడి.. అలా హేళన చేయడం క్రూరత్వం అవుతుందని విడాకులు మంజూరు చేసింది. తన భార్య తన తల్లిదండ్రులపై తనను రెచ్చగొట్టిందని, విడిపోవాలని పట్టుబట్టిందని, తాను అంగీకరించనప్పుడు దూకుడుగా ప్రవర్తించిందని భర్త ఆరోపించాడు. గర్భధారణ సమయంలో ఆమె తనను తాను గాయపరచుకోవడానికి ప్రయత్నించిందని, తన తల్లిదండ్రుల పెంపుడు ఎలుక అంటూ తనను పదే పదే అవమానించిందని ఆరోపించాడు.

తన భార్య తరచుగా పెద్దలను అగౌరవపరిచేదని, ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు అనుగుణంగా ఉండటానికి నిరాకరించిందని ఆరోపిస్తూ.. తన కుటుంబ సభ్యుల సాక్ష్యాలను కూడా అతను కోర్టుకు సమర్పించాడు. కోర్టులో తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తనతో ఉండమని భార్య పంపిన మెసేజ్‌లను కూడా అతను కోర్టుకు చూపించాడు. జీవిత భాగస్వామి తల్లిదండ్రులను విడిచిపెట్టమని బలవంతం చేయడం మానసిక క్రూరత్వానికి సమానమని కోర్టు పేర్కొంది.

2011లో కొంత కాలం మాత్రమే భర్తతో కలిసి అత్తరింట్లో ఉన్న భార్య.. ఆ తర్వాత అతన్ని విడిచిపెట్టడానికి చట్టపరమైన పరిమితిని చేరుకుందని కూడా బెంచ్ పేర్కొంది. తత్ఫలితంగా ఆమె ప్రవర్తన ఆమె కేసును బలహీనపరుస్తుందని పేర్కొంటూ, దాంపత్య హక్కుల పునరుద్ధరణ కోసం ఆమె చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. విడాకులు మంజూరు చేస్తూనే భార్యకు శాశ్వత భరణంగా రూ.5 లక్షలు చెల్లించాలని భర్తను కోర్టు ఆదేశించింది. పదే పదే అగౌరవపరచడం, జీవిత భాగస్వామిని వారి కుటుంబం నుండి దూరం చేయడానికి ప్రయత్నించడం, మానసిక వేధింపులు భారతీయ చట్టం ప్రకారం విడాకులకు చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యే కారణాలుగా గుర్తించబడతాయని ఈ తీర్పు బలపరుస్తుంది.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *