కాకినాడ జిల్లా ఉప్పాడలోని మత్స్యకారులు ఫార్మా పరిశ్రమల వ్యర్థాల కారణంగా తమ జీవనోపాధి దెబ్బతినడంతో రెండు రోజుల పాటు నిరసన తెలిపారు. కెమికల్ ఫ్యాక్టరీల వ్యర్థాల వల్ల సముద్ర కాలుష్యం పెరిగి, చేపల సంఖ్య తగ్గుతోందని వారు ఆరోపించారు. మొదటి రోజు జరిగిన చర్చలు ఫలించకపోవడంతో బుధవారం ఉదయం నుంచి ఆందోళన కొనసాగించారు. ఉప్పాడతో పాటు చుట్టుపక్కల గ్రామాల మత్స్యకారులు పెద్ద సంఖ్యలో నిరసనలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మత్స్యకారులతో చర్చించి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీని తెలియజేశారు. విజయదశమి తర్వాత డిప్యూటీ సీఎం వ్యక్తిగతంగా చర్చలు జరుపుతారని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చినా, మత్స్యకారులు అసంతృప్తితో ఉన్నారు. కెమికల్ ఫ్యాక్టరీలను మూసివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
CM Chandrababu: తిరుమలలో వెంకటాద్రి నిలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా దేవీ శరన్నవరాత్రులు
తిరుమలలో కన్నులపండువగా చిన్న శేష వాహన సేవ
మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్యులకు షోకాజ్ నోటీసులపై దుమారం