తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆల్ఫా పీడనం వల్ల ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ పీడనం త్వరలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండం 27వ తేదీన ఉత్తర కోస్తా తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రేపటి నుంచి 29వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఏలూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కోస్తా తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదని హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొవ్వూరులో అంతుచిక్కని వ్యాధితో పాడి గేదెలు మృత్యువాత
పాక్ క్రికెటర్ల తీరుపై ICCకి BCCI ఫిర్యాదు
లడఖ్ లో అదుపులోకి వచ్చిన ఆందోళనలు
RK Roja: పవన్ పార్ట్ టైం పొలిటీషియన్ గా మారారా
తెలంగాణలోని ఆ 12 జిల్లాల్లో భారీ వర్షాలు