మిథునం: ఈ రాశినాథుడైన బుధుడు తన మిత్రక్షేత్రమైన పంచమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల, రాజయోగాలు, ధన యోగాలు అనుభవానికి వస్తాయి. అనుకోని అదృష్టాలు కలుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. భోగభాగ్యాలకు లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. దైవ కార్యాలు, శుభ కార్యాల్లో బాగా పాల్గొంటారు. ఆశించిన శుభవార్తలు వింటారు. విదేశాల్లో ఉద్యోగం, డబ్బు సంపాదించే అవకాశాలు లభిస్తాయి.
కన్య: ఈ రాశికి అధిపతి అయిన బుధుడు ధన స్థానంలో సంచారం ప్రారంభించడం వల్ల ఈ రాశివారికి ఆదాయ వృద్ధికి అనేక మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయి, ఎటువంటి ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఉద్యోగంలో వేతనాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది.
తుల: ఈ రాశికి భాగ్యాధిపతిగా అత్యంత శుభుడైన ఇదే రాశిలో సంచరిస్తున్నందువల్ల అనేక శుభ యోగాలు కలగడానికి అవకాశం ఉంది. శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. అనేక విధాలుగా సంపద పెరుగుతుంది. ఆస్తి కలిసి రావడం, ఆస్తి విలువ పెరగడం, ఆస్తులు సమకూర్చుకోవడం, పిత్రార్జితం లభించడం వంటివి జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల పరంగానే కాక సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెంపొందుతాయి.
ధనుస్సు: ఈ రాశివారికి శుభ గ్రహమైన బుధుడు లాభ స్థానంలో సంచారం చేయడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులకు బాగా అవకాశం ఉంది. మరింత మంచి సంస్థలోకి మారడం జరుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. హోదా, ప్రాభవం పెరిగే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలన్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి.
మకరం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన బుదుడు దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఆర్థికంగా ఎంతగానో పురోగతి సాధించడం జరుగుతుంది. ఆకస్మిక సంపద ప్రాప్తికి అవకాశం ఉంది. మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లావాదేవీలు, కార్యకలాపాలు పెరిగి ఆర్థికంగా ఊహించని లాభాలు పొందుతారు.
కుంభం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో బుధ సంచారం వల్ల విదేశీ సంపాదన యోగం కలుగుతుంది. జీవన శైలి పూర్తిగా మారిపోతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. అనారోగ్యాల నుంచి సైతం ఉపశమనం లేదా విముక్తి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగవుతుంది. ఆత్మ విశ్వాసం, చొరవ బాగా పెరుగుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు చాలావరకు సఫలం అయి, జీవితంలో స్థిరపడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి.