Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రోరైల్ నిర్వహణ నుంచి తప్పుకున్న L&T..

Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రోరైల్ నిర్వహణ నుంచి తప్పుకున్న L&T..


హైదరాబాద్‌ మెట్రోరైల్ మొదటి దశ ప్రాజెక్టు నుంచి L&T తప్పుకుంది. తెలంగాణ ప్రభుత్వం చేతికి హైదరాబాద్‌ మెట్రో రైల్‌ రానంది. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి, ఎల్‌అండ్‌టీ సీఎండీ మధ్య  ఒప్పందం కుదిరింది. ఎల్‌అండ్‌టీకి ఉన్న రూ.13వేల కోట్ల అప్పును టేకోవర్‌ చేసేందుకు తెలంగాణ సర్కార్ ఒకే చెప్పింది. ఎల్‌అండ్‌టీకి ఈక్విటీ కోసం ఒకేసారి పరిష్కారంగా రూ.2,100 కోట్లు నగదు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.  అయితే మెట్రో రైలు నిర్వహణ నుంచి L&T ఎందుకు తప్పుకుందో తెలుసుకుందాం…

హైదరాబాద్‌ మెట్రో 69 కి.మీ.మొదటిదశని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.22 వేల కోట్లతో నిర్మిస్తే 3శాతం ప్రయాణికుల అవసరాలు మాత్రమే తీరుస్తోంది. గతేడాది జూన్‌లో1.38 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగితే.. ఈ ఏడాది జూన్‌లో ఆ సంఖ్య 1.24 కోట్లకు తగ్గింది. ప్రధానంగా గుమ్మం నుంచి గమ్యం దాకా…అంటే ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీకి సంబంధించి…. సరైన ప్రజారవాణా లేకపోవడమే సమస్య. మెట్రోని నిర్వహిస్తున్న ఎల్‌అండ్‌టీ, ప్రభుత్వ సంస్థ హెచ్‌ఎంఆర్‌.. అన్ని వేళల్లో, అన్ని స్టేషన్లలో ఈ సదుపాయం కల్పించడంలో విఫలమయ్యాయి. దీంతో నగరంలో కష్టమైనా 71%మంది వ్యక్తిగత వాహనాల్లోనే ప్రయాణిస్తున్నారు. స్టేషన్లలోపార్కింగ్‌ ఫీజులూ చెల్లిస్తున్నారు. ఆటోల్లో వస్తే ఎక్కువ డబ్బులు చెల్లిస్తున్నారు. మెట్రో ఎక్కడానికి వెళ్లినా, దిగినా ఇదే పరిస్థితి. ఛార్జీ గురించి కాకపోయినా సమయం వృథా అవుతోందంటున్నారు.

ఇక మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణంతో, మెట్రోకు ప్యాసింజర్లు తగ్గారు. మెట్రోలో ఇదివరకు సెలవురోజుల్లో రోజు మొత్తం రూ.59కే ప్రయాణించే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడం. మెట్రో స్మార్ట్‌ కార్డులున్నవారికి ప్రయాణ ఛార్జీలో 10శాతం రాయితీ ఉండేది. ఇప్పుడు అది కూడా తొలగించారు. ఇటీవల మెట్రో ఛార్జీలు పెంచగా తక్కువ దూరం ప్రయాణించేవారిపై భారం పడుతోంది. దీనివల్ల 5 శాతం వరకు తగ్గారని అంచనా. ఇక అన్ని స్టేషన్లలో పార్కింగ్‌ సౌకర్యం లేకపోవడం, ప్రజారవాణా కొన్ని స్టేషన్లకే, పరిమిత వేళల్లోనే ఉండడం కూడా మెట్రోను దెబ్బతీస్తోంది.

మెట్రో రైలు 3 కారిడార్లలో 56 స్టేషన్లున్నాయి. ప్రారంభ స్టేషన్లు..మియాపూర్, నాగోల్, ఎల్బీనగర్, రాయదుర్గం. ఇక ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్లు.. అమీర్‌పేట, పరేడ్‌గ్రౌండ్స్, ఎంజీబీఎస్‌. కూడలి స్టేషన్లు.. మెట్టుగూడ, హైటెక్‌సిటీ స్టేషన్లు. వీటినుంచే ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తున్నారు. వీటినుంచి కాలనీలు, కార్యాలయాలకు చేరుకునేందుకు ఫీడర్‌సర్వీస్‌లు ఉదయం, సాయంత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగతా స్టేషన్లకూ, అన్నివేళల్లోనూ ఈ సేవలందేలా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *