సినిమా చూడటానికి వారం ముందు నుంచి మాంసాహారం, మద్యం, పొగ తీసుకోకూడదని ఓ పోస్టర్ వచ్చింది. భూతా కోలా ఆచారాల ఆధారంగా వస్తున్న ఈ చిత్రాన్ని పవిత్రమైన మనసుతో చూడాలని ఆ లెటర్లో రాసుంది.. అది కాంతార టీం పేరుతో విడుదల చేసారు. ఇక్కడే వివాదం మొదలైంది. ఈ విషయంపై కాంతార టీమ్ వెంటనే స్పందించింది. దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. ఈ పోస్టర్ ఫేక్ అని, దీనికి హోంబలే ఫిల్మ్స్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చేసారు. ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం. ఎవరో ప్రమోషన్ కోసం చేసారన్నారు రిషబ్. ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్నా.. ప్రేక్షకుల వ్యక్తిగత జీవనశైలిని జడ్జ్ చేయలేమన్నారు ఈ హీరో. అక్టోబర్ 2న కాంతార: చాప్టర్ 1 విడుదల కానుంది.. థియేటర్‌కు వచ్చి హాయిగా ఎంజాయ్ చేయండి.. అనవసరంగా తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు అంటున్నారు రిషబ్. మూడేళ్ళ కింద వచ్చిన కాంతారకు ప్రీక్వెల్ ఇది. ఆ తెగ ఎక్కడ్నుంచి వచ్చింది.. ఉనికి కోసం వాళ్లు ఎలాంటి యుద్ధాలు చేసారనేది ఈ చిత్ర కథ. మొత్తానికి ఈ వివాదంతో కాంతారకు మంచి ప్రమోషనే వచ్చింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రికార్డ్ స్థాయిలో OG రిలీజ్.. వేచి చూస్తున్న కొత్త రికార్డులు
నీరుకొండపై 600 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం
ఫస్ట్ టైమ్ రైలు పై నుంచి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
షారూఖ్ ఫ్యామిలీపై మాజీ NCB అధికారి సమీర్ వాంఖడే పరువు నష్టం దావా
OG టికెట్ ధరల పెంపుపై స్టే శుక్రవారం వరకు తొలగింపు