నవరాత్రి సమయంలో చాలా మంది ఉపవాసం ఉంటారు. కొందరు ఒకటి లేదా రెండు రోజులు ఉపవాసం ఉంటారు. మరికొందరు మొత్తం తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు. అయితే, ఉపవాసంలో అనేక రకాల ఆహారాలు ఉండవు. బదులుగా, బంగాళాదుంప చాట్, బంగాళాదుంప కూర, సబుదాన కిచిడి లేదా బుక్వీట్ పిండి రోటీలు వంటి కొన్ని వంటకాలను మాత్రమే తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే, ఉపవాస భోజనంలో సాబుదాన తప్పనిసరిగా ఉంటుంది. అయితే, దీనిని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. కాబట్టి, నవరాత్రి ఉపవాస సమయంలో సాబుదాన తినడం గురించి పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..
సబుదాన..ఈ ముత్యం లాంటి తెల్లటి వస్తువు ఉపవాస భోజనంలో విస్తృతంగా వినియోగిస్తారు.. సబుదానలో కార్బోహైడ్రేట్లు, పిండి పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణం కావడం సులభం. అయితే, పోషకాహార నిపుణులు మాత్రం సబుదాన అతిగా తినడం పట్ల హెచ్చరిస్తున్నారు. నవరాత్రి ఉపవాస సమయంలో ఎక్కువగా సబుదాన తినడం వల్ల కలిగే ఆరోగ్యం తీవ్ర ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. నవరాత్రి ఉపవాసంలో సాబుదాన తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు పోషకాహార నిపుణురాలు కిరణ్ కుక్రేజా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. అందులో నవరాత్రి ఉపవాస సమయంలో చేసే కొన్ని తప్పులు మీ ఆరోగ్యానికి ఎలా హాని కలిగిస్తాయో హైలైట్ చేశారు.
ఇవి కూడా చదవండి
వీడియో ఇక్కడ చూడండి..
సబుదానాలో స్టార్చ్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర వేగంగా పెరుగుదలకు కారణమవుతుంది. అందువల్ల సబుదానను అధికంగా తినకుండా ఉండమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర పెరుగుదలకు దారితీస్తుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) ఎక్కువ. షుగర్ పేషెంట్లు జీఐ తక్కువుండే ఆహారాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. సాబుదానాలో కార్బోహైడ్రేట్ల శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు సాబుదానాకు దూరంగా ఉండటం అత్యవసరం అంటున్నారు.
ముఖ్యంగా నవరాత్రి ఉపవాసం సమయంలో కేవలం సగ్గుబియ్యం లేదా సాబుదానా మాత్రమే తీసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గొచ్చు అనుకుంటారు కొందరు. కానీ, ఇది పొరపాటే అంటున్నారు. సాబుదానాలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు రెండూ పుష్కలంగా ఉంటాయి. ఇది మీ బరువు తగ్గించడం పక్కన పెడితే మరింత వేగంగా మీ బరువును పెంచుతుందని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.