వైరల్ వీడియో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు సంబంధించినదిగా తెలిసింది. వీడియోలో వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్న ఎద్దులు స్థానికుల్ని ఎలా ఇబ్బందిపెడుతున్నాయో స్పష్టంగా చూపిస్తుంది. జోధ్‌పూర్‌లోని చైన్పురా బావ్డి ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఇందులో ఒక వీధి ఎద్దు ఒక వృద్ధ మహిళపై దాడి చేసింది. ఈ సంఘటన చాలా భయంకరంగా ఉంది. రోడ్డుపై వెళ్తున్న మహిళను 10 అడుగుల దూరం విసిరేసింది. ఈ మొత్తం సంఘటన సమీపంలోని సిసిటివి కెమెరాలో రికార్డ్ చేయబడింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
ఈ మొత్తం సంఘటన జోధ్‌పూర్‌లోని చైన్పురా బావ్డి ప్రాంతంలో జరిగింది. ఎర్రటి చీరలో ఉన్న ఒక వృద్ధ మహిళ గోకుల్ జీ బావి దగ్గర రోడ్డు దాటుతుండగా, ఒక ఎద్దు అకస్మాత్తుగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ మహిళను బలంగా కొట్టడంతో ఆమె 10 అడుగుల దూరంలో పడిపోయింది. ఈ మొత్తం సంఘటన సమీపంలోని సిసిటివి కెమెరాలో రికార్డైంది. దీనిని ఇప్పుడు సోషల్ మీడియాలో వేలాది మంది వీక్షించారు. ఎద్దు మొదట ఆ మహిళను తన కొమ్ములతో ఎత్తి ఆ మాంతంగా నేలకు విసిరి కొట్టింది. ఇదంగా వీడియోలో స్పష్టంగా చూపిస్తుంది.
ఇవి కూడా చదవండి
వీడియో ఇక్కడ చూడండి..
#जोधपुर में #सांड का आतंक. दादी को टक्कर मारकर 10 फुट दूर फेंका #Jodhpur #JodhpurNews #Bull pic.twitter.com/CNZ5EqY3yO
— Sambhava (@isambhava) September 25, 2025
ఎద్దు దాడి వీడియో సోషల్ మీడియాలో షేర్ అయిన వెంటనే వేలాది మంది దానిని షేర్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్‌ను ట్యాగ్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీడియోలోని మహిళ పరిస్థితిని చూసిన తర్వాత చాలా మంది వినియోగదారులు భావోద్వేగానికి గురయ్యారు. కొందరు అక్కడ పిల్లలు ఉంటే ఎలా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరు వైరల్ వీడియో తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడూ మేల్కొంటుందోనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..