పెళ్లి మంచంలోంచి వింత శబ్ధాలు.. భయంతో ఓపెన్‌ చేసిన భర్త.. కట్‌చేస్తే సీన్‌ సీతార్‌..!

పెళ్లి మంచంలోంచి వింత శబ్ధాలు.. భయంతో ఓపెన్‌ చేసిన భర్త.. కట్‌చేస్తే సీన్‌ సీతార్‌..!


ఇప్పుడు ప్రపంచమంతా సోషల్ మీడియాలో ప్రయాణిస్తోంది. ఇంటర్‌నెట్‌ వేదికగా ప్రతిరోజూ వింత విషయాలు, షాకింగ్‌ వార్తలు అనేకం వెలుగులోకి వస్తుంటాయి. ప్రతి రోజూ కొత్త వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇలాంటి వీడియోలు కొన్నిసార్లు సమాజంలోని చీకటి కోణాన్ని బహిర్గతం చేసే సంఘటనలు బయటపెడుతుంటాయి.. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో సంచలనం సృష్టించింది. ఒక వధువు తన వివాహ సమయంలో కట్నంలో భాగంగా తెచ్చిన చెక్క మంచంలో ఎవరూ ఊహించని సీన్‌ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వేగంగా వైరల్‌ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

సోషల్ మీడియాలో నవ వధువు మంచానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. ఇందులో కనిపించిన దృశ్యం మాత్రం అందరినీ షాక్‌ అయ్యేలా చేస్తుంది. ఈ సంఘటన ఎక్కడో జరిగింది ఖచ్చితమైన ప్రదేశం తెలియదు. కానీ అది విస్తృత చర్చకు దారితీసింది. వీడియో చూసిన తర్వాత, ముఖ్యంగా అబ్బాయిలు భయపడిపోతున్నారు. వీడియోలో నవ వధువు కట్నంగా తెచ్చుకున్న చెక్క మంచంలో తన ప్రేమికుడిని దాచిపెట్టి తెచ్చుకోవటం ఆ వీడియోలో చూపించారు. మంచం కింద ఏర్పాటు చేసిన స్టోరేజీ బాక్స్‌ ఓపెన్‌ చేసిన అత్తమామల ఇంట్లో కలకలం సృష్టించింది.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో ఆధారంగా వివాహం తర్వాత వధువు తన అత్తమామల ఇంట్లో తన పుట్టింటి వారు పెట్టిన మంచం ఏర్పాటు చేసుకుంటుంది. కానీ, ఆ గదిలోంచి వింత శబ్ధాలు రావటం వినిపించింది. ఆ అమ్మాయి లోపల ఒంటరిగా ఉంది. కానీ ,భర్త తనతో ఎవరో ఉన్నారని అనుమానించాడు. అది విన్న భర్త, కుటుంబ సభ్యులు పరుగులు తీసుకుంటూ ఆమె గదిలోకి ప్రవేశిస్తారు. వధువు భయాందోళనలకు గురవుతుంది. అప్పుడు, మంచం మీద బెడ్ షీట్లు తీసి బెడ్ బాక్స్ తెరుస్తారు. దాంతో లోపలి నుండి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. అతను వధువు ప్రియుడుగా తెలుసుకుంటారు. వెంటనే సదరు వ్యక్తికి దేహశుద్ధి చేసి ఇంట్లోంచి తరిమికొట్టారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియోను @silent_boy_ap_dhakad_602 అనే ఖాతా ద్వారా షేర్ చేశారు. పెళ్లిలో ఇచ్చిన మంచం నుండి ప్రియుడు బయటకు వచ్చాడు అనే క్యాప్షన్ తో ఈ వీడియోని పోస్ట్‌ చేశారు. కొన్ని గంటల్లోనే వీడియో లక్షలాది వ్యూస్‌ని సంపాదించింది. నెటిజన్లు ఫన్నీగా కొందరు, తీవ్ర ఆగ్రహంతో మరికొందరు కామెంట్లు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *