Viral Video: చిరుత ఎగరడం మీరెప్పుడైనా చూశారా..? అంత పెద్ద ప్రవాహాన్ని నీళ్లు తాగినంత ఈజీగా

Viral Video: చిరుత ఎగరడం మీరెప్పుడైనా చూశారా..? అంత పెద్ద ప్రవాహాన్ని నీళ్లు తాగినంత ఈజీగా


మాటు వేసి దాడి చేయడం… మెరుపు వేగంతో వేటను దొరకబట్టడం చిరుత స్టైల్. అది పంజా విసిరిందంటే ఏ జీవి అయినా.. ఖతం అవ్వాల్సిందే. అయితే ఎప్పుడైనా చిరుతపులి ఎగరడం మీరు చూశారా? కెన్యాలోని మసాయి మారా నేషనల్ రిజర్వ్‌లో ఫేసస్ అయిన చిరుతపులి లులుకా ఆశ్చర్యకరమైన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో చిరుతపులి ఒక చిన్న ప్రవాహాన్ని దాటడానికి ఎంత అద్భుతంగా దూకుతుందో చూడవచ్చు. దాని పక్షిలా ఎగరడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం.. ఆకలితో ఉన్న చిరుతపులి బంగారు సవన్నా మైదానాల్లో ఆహారం కోసం వెతుకుతుండగా.. నదికి అవతలి వైపు నిలబడి ఉన్న జింకను చూసింది. నదిని దాటకుండా తన ఎరను చేరుకోవడం అసాధ్యం. దీంతో అది ధైర్యసాహసాలు ప్రదర్శించి ఒక్క ఉదుటన ఆ ప్రవాహాన్ని దాటింది. ఆ దృశ్యం నిజంగా మంత్రముగ్ధులను చేసింది.

వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ అభిషేక్ చద్దా తన నికాన్ Z9 180-600mm కెమెరాతో ఈ అరుదైన, ఆశ్చర్యకరమైన క్షణాన్ని బంధించాడు. తన లెన్స్‌తో మసాయి మారాలో నదిని దాటుతున్న చిరుతపులిని బంధించడం ఒక థ్రిల్లింగ్ అనుభవంగా ఆయన అభివర్ణించారు. ప్రతి వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ కలలు కనే క్షణం ఇదని ఆయన అన్నారు, ఎందుకంటే ఇది కేవలం ఫోటో కాదని.. ఆఫ్రికన్ అడవి మాయాజాలంగా అభివర్ణించారు. ఈ వీడియోను షేర్ చేస్తూ..  @abhi_wildlife_frames అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి ఒక వన్యప్రాణి ఫోటోగ్రాఫర్, “మీరు ఎప్పుడైనా ఎగిరే చిరుతను చూశారా?” అని అడిగారు.  ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *