సూపర్ స్టార్ రజినీకాంత్ రీసెంట్‌గా కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కూలీ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ రిలీజ్ తర్వాత రిజల్ట్ తలకిందులు అయ్యింది. ప్రస్తుతం రజినీకాంత్ జైలర్ 2 సినిమాలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే రజినీకాంత్ సినిమాలో నటించడం వల్ల నిరాశ మాత్రమే మిగిలిందని ఓ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. దాంతో ఆమె పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఓ రేంజ్ ఫైర్ అవుతున్నారు. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరు.? ఎందుకు సూపర్ స్టార్ సినిమా వల్ల నిరాశ మిగిలింది అనేది చూద్దాం.!
ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా సీన్స్ మొత్తం కట్ చేశారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన మమతా మోహన్ దాస్
సూపర్ స్టార్ సినిమా పై కామెంట్స్ చేసిన ఆ హీరోయిన్ ఎవరో కాదు రెబా మోనికా. శ్రీ విష్ణు నటించిన సామజవరగమన సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది రెబా మోనికా జాన్. ఇక రీసెంట్ గ మ్యాడ్ స్క్వేర్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. స్వాతిరెడ్డి సాంగ్ లో దుమ్మురేపే స్టెప్పులేసి తెలుగు ఆడియెన్స్ ను మైమరిపించింది. బెంగళూరుకు చెందిన ఈ ముద్దుగుమ్మ 2016లో జకబింటే స్వర్గరాజ్యం అనే ఒక మలయాళం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఎక్కువగా తమిళ్ సినిమాల్లోనే నటించింది. ఫోరెన్సిక్, జరుగండి, బిగిల్, మైఖేల్, ఎఫ్.ఐ.ఆర్, బూ తదితర హిట్ సినిమాల్లో నటించింది.
ఇవి కూడా చదవండి
బెస్ట్ ఫ్రెండ్ భర్తనే వలలో వేసుకున్న స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే అతనితో..
రీసెంట్ గా కూలీ సినిమాలో నటించింది రెబా మోనికా. సినిమాలో శ్రుతిహాసన్ చెల్లిగా నటించింది. కానీ ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో నటించిచినప్పటికీ తనకు పెద్దగా ప్రయోజనం లేదు. ఎంతవరకు చేయగలనో అంతవరకు సినిమాలో చేశా.. కానీ కొన్నిసార్లు మనం అనుకున్నట్టు జరగవు. ఈ సినిమా ద్వారా నిరుత్సాహమే మిగిలిందని ఆమె చెప్పుకొచ్చింది. దాంతో రజినీకాంత్ ఫ్యాన్స్ మోనికా పై ఫైర్ అవుతున్నారు. గతంలో ఆమె మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఈ పాత్ర కోసం తానే డైరెక్టర్ ని సంప్రదించానని.. చిన్న పాత్రే అని దర్శకుడు ముందే చెప్పారని ఆమె చేసిన కామెంట్స్ ను, ఆ వీడియోలను షేర్ చేస్తూ రెబా మోనికా పై విమర్శలు చేస్తున్నారు.
చేసింది రెండు సినిమాలు.. రెండూ యావరేజ్..! అయినా తగ్గని క్రేజ్.. చూస్తే ప్రేమలో పడిపోవాల్సిందే
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి