డీఎన్‌ఏ(DNA) టెస్ట్ (డియోక్సిరిబో న్యూక్లియిక్ ఆమ్లం) మన వంశానికీ, మన జన్యువులకీ సంబంధించిన కీలక సమాచారాన్ని తెలియజేసే అతి ముఖ్యమైన వైద్యపరీక్ష. మన శరీరంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు కలిపి కోట్లాది కణాలు ఉంటాయి. DNA అనేది మన శరీర కణాలలో నిల్వ ఉంటూ, తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా పిల్లలకు సంక్రమిస్తుంది. అలాంటి టెస్ట్ చాలా అరుదుగా చేస్తుంటారు. అయితే, ఒక మహిళ తన సరదా కోసం ఈ DNA టెస్ట్ చేయించుకుంది. దాంతో వారి కుటుంబంలో ఏళ్ల తరబడి తెలియకుండా గుట్టుగా ఉన్న రహస్యం ఒకటి బయటపడింది. దాంతో ఆమెకు షాక్ తిన్నాంత పనైంది. ఈ విచిత్ర సంఘటన బ్రిటన్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
UK లోని యార్క్‌షైర్‌కు చెందిన ఒక మహిళ DNA పరీక్ష అంటే ఏమిటి..? దాని ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనే ఆసక్తితో ఉండేది. అదే ఉత్సుకతతో ఆమె సరదాగా పరీక్ష కోసం తన నమూనాను ఇచ్చింది. ఆ తరువాత జరిగింది తాను ఊహించలేదు. ఈ ఒక్క పరీక్ష ఆమె జీవితాన్ని మార్చేసింది. టెస్ట్ రిపోర్ట్స్‌కి సంబంధించిన సదరు 53 ఏళ్ల జానెట్ అనే మహిళ చెప్పిన వివరాల మేరకు.. DNA పరీక్ష ఒక సరదా ప్రయోగం అవుతుందని నేను అనుకున్నాను – కానీ నాలుగు సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి నన్ను సంప్రదించాడు. అతను నా సవతి సోదరుడు అని చెప్పుకున్నాడని తెలిపింది. తాను సరదాగా చేయించుకున్న టెస్ట్ ఫలితంగా ఆమె 88 ఏళ్ల తండ్రికి తనకు తెలియకుండా మరో బిడ్డ ఉన్నాడని అనుకోకుండా తెలుసుకుంటుంది.
జానెట్ తన ఐరిష్ వారసత్వం గురించి తెలుసుకోవడానికి DNA పరీక్ష యాప్ ని ఉపయోగించినప్పుడు ఇదంతా వెలుగులోకి వచ్చింది. స్కాట్లాండ్‌లోని ఒక వ్యక్తి జానెట్‌కు నువ్వు నా చెల్లివి, నీ నాన్న నాకు కూడా నాన్న అంటూ మెసేజ్ చేశాడని చెప్పింది. దాంతో ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయానని చెప్పింది. ఈ విషయం తన తండ్రికి చెప్పాలనుకుంది. కానీ, ఈ షాకింగ్ న్యూస్ తెలిశాక తన తండ్రి ఆరోగ్యానికి ఏం కాకూడదు అనుకుంది. గుండెపోటు లాంటివి రాకూడదని కోరుకుంది. కానీ, తన తండ్రితో చెప్పాలని నిర్ణయించుకుంది.
ఇవి కూడా చదవండి
ఎట్టకేలకు తెలిసిన నిజాన్ని తన వృద్ధ తల్లిదండ్రులకు చెప్పేసింది. కానీ, జానెట్ 87 ఏళ్ల తల్లి ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే జానెట్ అన్నగా చెప్పుకుంటున్న వ్యక్తి.. తన తండ్రి పెళ్లి చేసుకునే ముందు పుట్టాడట.. జానెట్ తన తండ్రికి ఆ విషయం చెప్పినప్పుడు, అతను షాక్ అయ్యాడు. అరవైలలో తాను ఎవరితో డేటింగ్ చేసింది గుర్తుచేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ, అతడికి ఆమె పేరు కూడా గుర్తు లేదట. కానీ, ఆమె చాలా చెడ్డది.. అని మాత్రం చెప్పాడని జానెట్ చెప్పుకొచ్చింది. అలాగే, తన తండ్రి ఫోటో తప్ప మరేమీ అడగని ఆ వ్యక్తి మోసగాడు కాదని తెలుసుకుంది. దీంతో వీరి కథ సుఖాంతంగా మారింది.
ఇప్పుడు జానెట్ సవతి సోదరుడు తన తండ్రితో ఆన్‌లైన్‌లో కనెక్ట్ అవ్వడమే కాకుండా, 60 సంవత్సరాల తర్వాత వారు కలిసి తమ మొదటి ఫాదర్స్ డేను కూడా జరుపుకున్నారు. ఇది జానెట్ కుటుంబంపై పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ, ఆమె సరదాగా చేయించుకున్న డీఎన్‌ఏ టెస్ట్‌తో ఆమె జీవితాన్ని ఇలా మార్చేసిందని చెప్పింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..