అయ్యో పాపం.! కూరలో కరివేపాకులా లేపేశారు..!! ఓజీలో ఈ క్రేజీ బ్యూటీని కట్ చేశారు..

అయ్యో పాపం.! కూరలో కరివేపాకులా లేపేశారు..!! ఓజీలో ఈ క్రేజీ బ్యూటీని కట్ చేశారు..


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తుంది. నేడు సెప్టెంబర్ 25న ఓజీ సినిమా థియేటర్స్ లో విడుదలైంది. ఈ సినిమా మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనను ఎలా చూడాలనుకుంటున్నారా ఈ సినిమాలో అలా చూపించాడు దర్శకుడు సుజిత్. చాలా కాలం తర్వాత పవర్ ఫుల్ అండ్ స్టైలిష్ లుక్ లో కనిపించారు పవన్ కళ్యాణ్.  దాంతో థియేటర్ దగ్గర పవన్ కళ్యాణ్ అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఓజీ సినిమా దూసుకుపోతుంది. హరిహరవీరుమల్లు సినిమా తర్వాత వచ్చిన ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా సీన్స్ మొత్తం కట్ చేశారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన మమతా మోహన్ దాస్

ఓజీ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ నటించింది. పవన్ కళ్యాణ్ భార్యగా ప్రియాంక నటించి మెప్పించింది. అలాగే శ్రీయా రెడ్డి సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించారు. వీరితో పాటు మరో ముద్దుగుమ్మ కూడా ఓజీ సినిమాలో నటించింది. ఆమె ఎవరో కాదు గ్లామరస్ బ్యూటీ నేహా శెట్టి. డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇవి కూడా చదవండి

బెస్ట్ ఫ్రెండ్ భర్తనే వలలో వేసుకున్న స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే అతనితో..

ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన ఈ చిన్నదానికి అంతగా క్రేజ్ రాలేదు. దాంతో మెల్లగా ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గాయి. దాంతో సోషల్ మీడియాలో ఎక్కవగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ఓజీ సినిమాలో నేహా శెట్టి స్పెషల్ సాంగ్ లో కనిపించనుందని నిన్నటి వరకు టాక్ వినిపించింది. అలాగే నేహా శెట్టి కూడా దీనిని కన్ఫర్మ్ చేసింది. పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తున్నా . ఓ స్పెషల్ సాంగ్ తోపాటు కొన్ని సన్నివేశాల్లోను కనిపిస్తా అని నేహా శెట్టి చెప్పుకొచ్చింది. కట్ చేస్తే సినిమా విడుదలైన తర్వాత ఆమె సాంగ్ ను, సీన్స్ ను లేపేశారు. సినిమా లెన్త్ కారణంగా ఆమె సాంగ్ ను లేపేశారని తెలుస్తుంది. ఎడిటింగ్ లో నేహా శెట్టి స్పెషల్ సాంగ్ కట్ అయిపోయింది. దాంతో ఆమె ఫ్యాన్స్ కాస్త నిరాశపడుతున్నారు.

చేసింది రెండు సినిమాలు.. రెండూ యావరేజ్..! అయినా తగ్గని క్రేజ్.. చూస్తే ప్రేమలో పడిపోవాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *