నేటి సోషల్ మీడియా యుగంలో కొన్ని బ్యూటీ టిప్స్ ఇంటర్నెట్లో ప్రతిరోజూ వైరల్ అవుతున్నాయి. కానీ ఈ రోజు మనం మీ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే కొన్ని బ్యూటీ టిప్స్ తెలుసుకోబోతున్నాం..అది కూడా అందరికీ అందబాటులో ఉండే, అతి తక్కువ ఖర్చులో లభించే పదార్థంతోనే. చాలా మంది అమ్మాయిలు, ఆడవాళ్లు తరచుగా ఖరీదైన సీరమ్ల కోసం డబ్బు ఖర్చు చేస్తుంటారు. కానీ, మన వంటగదిలోనే లభించే ఈ విత్తనాలపై శ్రద్ధ చూపరు. అవును.. చియాసీడ్స్‌తో మీరు మచ్చలేని మెరిసే చర్మాన్ని ఎలా పొందవచ్చునో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
మంచి చర్మం కోసం అంటే మీరు మీ ముఖానికి అప్లై చేసే ఉత్పత్తులు మాత్రమే కాదు, మీ ఆహారం కూడా. చియా గింజలు దీనికి సరైనవి. కాబట్టి చియా విత్తనాలు మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎలా సహాయపడతాయో తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు. నిర్జలీకరణం వల్ల చర్మం నిస్తేజంగా, నిర్జీవంగా మారుతుంది. అలాంటప్పుడు చియా సీడ్స్‌తో సీరమ్ తయారు చేసుకుని ముఖానికి రాసుకోవడం వల్ల ముఖం తేమ కలిగి ఉంటుంది. చర్మం సాగిపోవడం వంటి బాధలు ఉండవు. నానబెట్టిన చియా సీడ్స్ జెల్‌ను మీరు ముఖానికి రాసుకుంటే సరిపోతుంది. దీని ఫలితంగా బొద్దుగా, మృదువుగా, తాజాగా కనిపించే చర్మం మీ సొంతం అవుతుంది.
కాలుష్యం, ఒత్తిడి, నిరంతరాయంగా ఎక్కువ సమయం స్క్రీన్ చూడటం వల్ల చర్మంపై ప్రభావం చూపుతాయి. చియాలోని యాంటీఆక్సిడెంట్లు ఈ సమస్యలతో పోరాడుతాయి. వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేయడానికి, నిస్తేజంగా ఉండే చర్మాన్ని మెరిసేలా ఉంచడానికి సహాయపడతాయి. మన చర్మానికి కొల్లాజెన్ చాలా అవసరం. కానీ, వయసు పెరిగే కొద్దీ అది క్షీణించడం ప్రారంభమవుతుంది. చియాలో కొల్లాజెన్ ఉండదు, కానీ శరీరం కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయడానికి సహాయపడే పోషకాలు ఇందులో ఉంటాయి.
* చియా సీడ్స్ పొడిలో గ్రీక్ యోగర్ట్ కలిపి ముఖానికి రాసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల స్కిన్ టోన్ బాగుంటుంది. ముఖం కాంతివంతంగా మారుతుంది.
ఇవి కూడా చదవండి
* ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్‌లో తేనె, నిమ్మరసం కలిపి స్క్రబ్ చేసినట్లయితే మృత కణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.
* చియా సీడ్స్ జెల్లో కొబ్బరి నూనె కలిపి ముఖానికి రాసుకోవాలి. రాత్రి నిద్ర పోయేటప్పుడు రాసుకుని ఉదయాన్నే వాష్ చేసుకుంటే ముఖం కాంతివంతంగా ఉంటుంది.
*చియా సీడ్స్ అందాన్ని పెంపొందించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. చియా సీడ్స్‌లో కలబంద గుజ్జు కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే ముఖం తేమగా ఉంటుంది. అందంగా మారుతుంది.
* గ్రీన్ టీలో చియా సీడ్స్, తేనె కలిపి బాగా మిక్స్ చేయాలి. దీనిని ముఖానికి రాయడం వల్ల మంట, వాపు, యాక్నె తగ్గుతాయి. ముఖం క్లీన్ అవుతుంది.
* చియా సీడ్స్‌లో అవకాడో గుజ్జు వేసి ముఖానికి రాసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంపై ఉన్న ఫైన్ లైన్స్, ముడతలు వంటివి పోతాయి.
* చియా సీడ్స్‌ను నీళ్లలో నానబెట్టి ఆ నీటిని రోజు తాగితే చర్మం చాలా బాగుంటుంది. ముఖం కాంతివంతంగా, అందంగా మారుతుంది.
* చియా సీడ్స్‌లో రోజ్ వాటర్ కలిపి స్ప్రే బాటిల్లో వేసుకుని ముఖానికి స్ప్రే చేసినట్లయితే ముఖంపై గ్లో వస్తుంది. అందంగా కనపడతారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.