సాధారణంగా దొంగలు బ్యాంక్ లేదా నగల షాప్‌లో దూరి దొంగతనం చేయాలనుకుంటే ఇద్దరు లేదా ముగ్గురు వస్తారు. గన్లు, కత్తులతో బెదిరించి అందినకాడికి దోసుకెళ్తారు. కానీ అమెరికాలోని కాలిఫోర్నియాలో మాత్రం ఒకేసారి 25 మంది దొంగలు ఒక నగల షాప్‌లోకి చొరపడ్డారు. అది చూసిన షాపు సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వారి చేతుల్లో ఉన్న ఆయుధాలను చూసి వణికిపోయారు. దోపిడి చేసేందుకు వచ్చిన దొంగలు తమ దగ్గర ఉన్న సుత్తెలు, గడ్డపారలు వంటి మారణాయుధాలతో షాపును మొత్తం ధ్వంసం చేశారు. ఆ తర్వాత షాప్‌లో ఉన్న బంగారం మొత్తం దోచుకొని అక్కడి నుంచి పారిపోయారు. షాప్‌లోని సీసీ కెమెరాలో రికార్డైన ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
దుండగులు పారిపోయిన కాసేపటికే షాప్ యజమానికి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించారు. మొత్తం 25 మందిలో ఇప్పటివరకు 7 ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి కొంతవరకు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరికి పాల్పడిన దొంగలు సుమారు రూ.9కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు
ఈ ఘటనసౌ స్థానిక పోలీసులు మాట్లాడుతూ.. కాలిఫోర్నియాలో రెండేళ్లలో జ్యువెలరీ షాప్‌లను లక్ష్యంగా చేసుకుని జరిగిన దోపిడీల్లో ఇది రెండవ అతిపెద్ద దోపిడీగా చెప్పుకొచ్చారు. గతంలో 2023లో, ఏడుగురు ముసుగు ధరించిన వ్యక్తులు సెయింట్ పాట్రిక్స్ డే రోజున ఇదే విధంగా ఒక నగల షాప్‌లోకి చొరబడి కోట్ల విలువైన ఆభరణాలను దోచుకున్నట్టు వెల్లడించారు.
వీడియో చూడండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.