చక్కెరకు గుడ్ బై చెప్పడం వల్ల బరువు తగ్గుతారు. ఎందుకంటే తీపి ఆహారాలు, పానీయాలలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది బొడ్డు , నడుము కొవ్వును తగ్గించడంలో ముఖ్యంగా ప్రభావవంతంగా ఉంటుందని తేలింది. దీనికి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లాండ్‌లోని లింకన్‌షైర్‌లో నివసించే 61 ఏళ్ల సుసాన్ గార్నర్ ఒకప్పుడు కప్పు మీద కప్పు టీ తాగుతూ రోజంతా టీలో మునిగి తేలుతూ గడిపింది. టీ ఒక అభిరుచిగా కాకుండా ఒక వ్యసనంగా మారిపోయింది. ప్రతిరోజూ 20 కప్పుల టీ తాగడం.. అలా తాగే ప్రతి కప్పుకు నాలుగు టీస్పూన్ల చక్కెర జోడించడం ఆమె దినచర్యలో భాగం. అంటే వారానికి 140 కప్పుల టీ .. ప్రతి మూడు రోజులకు ఒక కిలోగ్రాము చక్కెర తినేది అన్నమాట.
ఈ అలవాటు ఆమె శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆమె బరువు దాదాపు 95 కిలోలకు (14 స్టోన్ 12 పౌండ్లు) పెరిగింది. ఆమె దుస్తుల సైజ్ 20కి పెరిగింది. ఆమె ఆత్మవిశ్వాసం క్రమంగా సన్నగిల్లింది. ఎంతగా అంటే ఆమె బయటకు అడుగు పెట్టడానికి కూడా వెనుకాడింది.
డాక్టర్ ఇచ్చిన సలహా ఏమిటంటే
ఫిబ్రవరి 2025లో సుసాన్ జనరల్ ప్రాక్టీషనర్ ఆమెకు కొత్త మార్గాన్ని సూచించారు. బరువు తగ్గడాన్ని ప్రోత్సహించే ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడే మౌంజారో అనే మందును ఆయన సూచించారు. ప్రారంభ మోతాదు 2.5 mg, ఇది కాలక్రమేణా 7 mgకి పెరిగింది. మొదట్లో ఆమె ఎటువంటి ముఖ్యమైన మార్పులను గమనించలేదు. కానీ మొదటి వారంలోనే 7 పౌండ్లు (సుమారు 3 కిలోలు) తగ్గడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఈ మెడిసిన్ తో పాటు డాక్టర్ .. NHS మార్గదర్శకాలను పాటించమని సలహా ఇచ్చాడు
ఇవి కూడా చదవండి
రోజూ 10,000 అడుగులు నడవడం
2 కనీసం 2 లీటర్ల నీరు త్రాగాలి
ప్రతిరోజూ ఐదు సార్లు పండ్లు లేదా కూరగాయలు తినడం
అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సుసాన్ టీ తాగడం మానేయలేదు. ఆమె టీతాగే విషయంలో రాజీ పడింది.. చక్కెరను వదులుకుంది.. అయితే రుచి విషయంలో రాజీ పడకుండా ఉండటానికి ఆమె కృత్రిమ స్వీటెనర్‌ను ఉపయోగించడం ప్రారంభించింది. ఆమె ఇప్పటికీ ప్రతి కప్పుకు నాలుగు టీస్పూన్ల స్వీటెనర్‌ను కలుపుకుంటుంది. అయితే ఇది చక్కెర కాదు.. తీపిని ఇస్తుంది.
ఈ రకమైన మార్పు ఆమెకు చాలా ప్రయోజనాన్ని ఇచ్చింది. చక్కెర లేకుండా ఆమె టీ రుచిని ఆస్వాదించింది. కేవలం ఎనిమిది నెలల్లో సుసాన్ దాదాపు 6 స్టోన్ (38 కిలోలు) బరువు తగ్గింది. ఆమె ఇప్పుడు 9 స్టోన్ (సుమారు 57 కిలోలు) బరువుకి చేరుకుంది. దుస్తుల సైజ్ కూడా 20 నుంచి 10 కి చేరుకుంది. ఒకప్పుడు దుస్తుల్లో తన శరీరాన్ని దాచుకునే సుసాన్ ఇప్పుడు ఫిట్టెడ్ జీన్స్,స్టైలిష్ దుస్తులను ధరిస్తుంది. తాను కనీసం 10 సంవత్సరాలు చిన్నదానిగా మారినట్లు ఆమె చెబుతుంది.
గతంలో సుసాన్ అల్పాహారంగా రెండు తెల్ల బ్రెడ్ ముక్కలు, జామ్ , రెండు కప్పులషుగర్ టీతో రోజుని ప్రారంభించేది. ఇక రోజంతా, బిస్కెట్లు, కేకులు, చక్కెర ఉన్న 18 కప్పుల టీ సర్వసాధారణం. ఈ దినచర్య ఆమె బరువు పెరిగేలా చేయడమే కాదు.. ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపించింది. అయితే ఇప్పుడు సుసాన్ తన రోజుని పూరి భిన్నంగా ప్రారంభిస్తోంది.
అల్పాహారం: ఉడికించిన గుడ్డు, ఒక ముక్క టోస్ట్, రెండు కప్పుల టీ (స్వీటెనర్ తో)
ఆమె ఇప్పటికీ రోజుకు 18 కప్పుల టీ తాగుతుంది అయితే ఆ టీలో చక్కెరకు బదులుగా స్వీటెనర్, స్కిమ్డ్ మిల్క్ ఉంటాయి.
రాత్రి భోజనం: బంగాళాదుంపలు, జున్ను, బీన్స్, తాజా సలాడ్ వంటి ఆహారాన్ని డిన్నర్ గా తీసుకుంటుంది.
ఈ మార్పు కేవలం బరువు తగ్గడానికే పరిమితం కాలేదు. సుసాన్ జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తన అధిక బరువు కారణంగా సామాజికంగా ఎవరితోనైనా కలవాలంటే వెనుకాడేది. అయితే తగ్గిన బరువు.. మారిన శరీరం తీరుతో సుసాన్ తనకు నచ్చిన దుస్తులను ధరిస్తుంది. పది మంది మధ్యకు వెళ్ళడానికి ఏ మాత్రం భయపడడం లేదు. సకాలంలో తీసుకునే చర్య, కొంచెం క్రమశిక్షణ, సరైన వైద్య సహాయం జీవితాలను పూర్తిగా మార్చగలవని సుసాన్ రుజువు చేస్తుంది.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..