చిక్కుల్లో షారుఖ్ ఖాన్.. రూ. 2 కోట్ల పరువునష్టం కేసు.. నెట్ ఫ్లిక్స్ పై..కూడా

చిక్కుల్లో షారుఖ్ ఖాన్.. రూ. 2 కోట్ల పరువునష్టం కేసు.. నెట్ ఫ్లిక్స్ పై..కూడా


షారుఖ్ ఖాన్, గౌరి ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, నెట్‌ఫ్లిక్స్‌పై రూ. 2 కోట్ల పరువునష్టం కేసు నమోదైంది. IRS అధికారి సమీర్ వాంఖేడే పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. ‘ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ వెబ్ సిరీస్‌లో తనపై మోసపూరిత, పరువుకు భంగం కలిగే కంటెంట్‌ ఉందంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సమీర్ వాంఖేడే. ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలోని ఈ సిరీస్ మద్యపాన వ్యతిరేక ఏజెన్సీలపై తప్పుగా చిత్రీకరించి, ప్రజలలో నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోందని ఆయన ఆరోపించారు.

సిరీస్‌లో “సత్యమేవ జయతే” నినాదం చేసిన పాత్ర మిడిల్ ఫింగర్ చూపి అశ్లీలత ప్రదర్శించిందని, ఇది చట్ట ఉల్లంఘన అని వాంఖేడే పేర్కొన్నారు. అలాగే ఆర్యన్ ఖాన్ కేసు బొంబే హైకోర్టు, NDPS స్పెషల్ కోర్టులో పెండింగ్‌లో ఉండగా, తన ప్రతిష్టను దెబ్బతీసే సిరీస్ తయారు చేశారని ఆరోపణ. సిరీస్ IT యాక్ట్, BNS చట్టంలోని పలు సెక్షన్లను ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. అలాగే పరువు నష్టం సొమ్మును టాటా మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రికి దానం చేస్తానని వాంఖేడే పేర్కొన్నారు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *