
ఛత్తీస్గఢ్లో ఓ వింత కేసు వెలుగుచూసింది. అంబికాపుర్ సెంట్రల్ జైలులోని ఓ ఖైదీ తన మూత్ర నాళంలో మంట, దురదగా ఉందని అధికారులకు తెలిపాడు. దీంతో అక్కడ ప్రాథమిక టెస్టులు చేసిన జైలు డాక్టర్లు.. ఆస్పత్రికి రిఫర్ చేశారు. దీంతో ఖైదీని అంబికాపుర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తీసుకెళ్లగా.. అతని ప్రవేట్ పార్ట్ (మూత్ర నాళంలో) పెన్సిల్ ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. దీంతో వెంటనే ఆపరేషన్ చేసి.. అతని మూత్రనాళం నుంచి 9 సెంటీ మీటర్ల పెన్సిల్ బయటకు తీశారు. దీంతో అతనికి ప్రాణాపాయం తప్పింది.
పెన్సిల్ అలా ఇరుక్కుపోవడం వల్ల బాధితుడికి.. మూత్ర విసర్జనలో ఆటంకం ఏర్పడిందని, తీవ్ర రక్తస్రావం జరిగినట్లు డాక్టర్లు గుర్తించారు. సమయానికి సర్జరీ చేయకపోయి ఉంటే.. అతని మూత్ర నాళం పగిలిపోయి తీవ్ర రక్తస్రావం జరిగేదని, దీంతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉండేదన్నారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. అతని వైద్యులు పర్యవేక్షణలో ఉన్నట్లు జైలు అధికారులు తెలిపారు. కాగా మూత్ర నాళంలో పెన్సిల్ ఎందుకు పెట్టావని ప్రశ్నించగా.. లోపల మంట, దురదగా ఉండటంలో అలా చేశానని ఖైదీ డాక్టర్లకు బదులిచ్చాడు. కాగా తాము ఇలాంటి కేసు గతంలో ఎప్పుడూ చూడలేదని అంబికాపుర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల డాక్టర్లు తెలిపారు.
అంబికాపుర్ సెంట్రల్ జైలులో జరిగిన ఈ ఘటన అక్కడ భద్రతా వ్యవస్థ గురించి ప్రశ్నలను లేవనెత్తుతుంది. అసలు అతని వద్దకు పెన్సిల్ ఎలా వచ్చింది అన్న అంశంపై జైలు అధికారులు విచారణ చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.