ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తున్నారు. పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. పుష్ప, పుష్ప 2 సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సూపర్ హీరో కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో దీపికతో పాటు మరికొంతమంది హీరోయిన్స్ కూడా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ఎంకరేజ్ చేయడం వల్లే ఓ హీరోయిన్‌కు స్టార్ డమ్ వచ్చిందని తెలిపింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా సీన్స్ మొత్తం కట్ చేశారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన మమతా మోహన్ దాస్
అల్లు అర్జున్ ఎంకరేజ్ చేయడంతోనే తాను డాన్స్ ల్లో స్టార్ గా మారాను అని చెప్పిన హీరోయిన్ ఎవరో కాదు మిల్కీ బ్యూటీ తమన్నా. తమన్నా ఒకానొక సమయంలో టాలీవుడ్‌ను ఏలింది. వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.. హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో బిజీగా మారిపోయింది. తమన్నా ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది. హిందీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది ఈ చిన్నది. తెలుగులో చివరిగా చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమాలో చేసింది. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
బెస్ట్ ఫ్రెండ్ భర్తనే వలలో వేసుకున్న స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే అతనితో..
తాజాగా తమన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అప్పట్లో నేను తెలుగు, తమిళ్ సినిమాల్లో వరుసగా సినిమాలు చేశా.. చాలా రకాల కమర్షియల్ సినిమాలు చేశా.. ప్రతి సినిమాలో నాలుగు, ఐదు సాంగ్స్ ఉండేవి.. కానీ నాకు డాన్స్ చేసే అవకాశం చాలా తక్కువ ఉండేవి. అల్లు అర్జున్ తో బద్రీనాథ్ సినిమాలో మాత్రం ఆయనతో సమానంగా డాన్స్ చేశా.. అల్లు అర్జున్ నన్ను ఎంకరేజ్ చేశారు. అల్లు అర్జున్ తో సమానంగా ఫ్లోర్ మూమెంట్స్ చేయడానికి ఎంకరేజ్ చేశాడు. ఆతర్వాత నాకు డాన్స్ చేయడానికి ఎక్కువ అవకాశాలు వచ్చాయి. అలాగే స్పెషల్ సాంగ్స్ లోనూ ఛాన్స్ లు వచ్చాయి అని తమన్నా చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
చేసింది రెండు సినిమాలు.. రెండూ యావరేజ్..! అయినా తగ్గని క్రేజ్.. చూస్తే ప్రేమలో పడిపోవాల్సిందే
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి