స్మార్ట్ ఫోన్ లేని జీవితాన్ని ఊహించుకోగలమా? కానీ, కొన్నేళ్ల క్రితం వరకూ ఫోన్ అనే ఒక వస్తువు రోజువారీ జీవితంలోకి వస్తుందని ఎవరైనా ఊహించారా? అంతెందుకు ఏఐ గురించి ఒకప్పుడు ఎవరైనా ఊహించారా? టెక్నాలజీ అంటే అంతే.. ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. ఇలాగే ఫ్యూచర్ లో మొబైల తో పని లేకుండా కొత్త కొత్త డివైజ్ లు ఎంట్రీ ఇస్తాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు మనం ఫోన్ ఏయే పనుల కోసం వాడుతున్నామో ఆ పనులన్నీ స్మార్ట్ ఏఐ వేరబుల్స్ చేసేస్తాయట. ఇవెలా ఉంటాయంటే..
స్మార్ట్ గ్లాసెస్
రాబోయే కాలంలో స్మార్ట్ గ్లాసెస్ టెక్నాలజీ ట్రెండ్ అవ్వనుంది. కళ్లజోడు మీదే స్క్రీన్ కనిపించడం, వాయిస్ కమాండ్స్ ద్వారా ఆ స్క్రీన్ ను ఆపరేట్ చేయడం, గ్లాసెస్ లోనే మెమరీ కార్డ్, ప్రాసెసర్.. ఇలా స్మార్ట్ గ్లాసెస్ మొబైల్ అవసరాన్ని చాలా వరకూ తగ్గించబోతున్నాయి.
ఏఐ అసిస్టెంట్స్
ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి దానికి ఫోన్ తీసుకునే పని లేకుండా రకరకాల ఏఐ హోమ్ అప్లయెన్సెస్ రాబోతున్నాయి. అంటే అలెక్సా వంటి స్మార్ట్ స్పీకర్లు, ఏఐతో కనెక్ట్ చేయబడిన టీవీలు మొదలైనవి. అంటే ఇంట్లో కూర్చొని వాయిస్ కమాండ్స్ ద్వారా సినిమాలు చూడొచ్చు. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాయిస్ అసిస్టెంట్స్ ను అడగొచ్చు. అంటే ప్రతి దానికీ మొబైల్ పట్టుకునే పని ఉండదన్న మాట.
స్మార్ట్‌వాచ్‌లు
ఇకపోతే ఫ్యూచర్లో స్మార్ట్‌వాచ్‌లు పూర్తిగా ఏఐ టెక్నాలజీతో రానున్నాయి. ఇప్పటి వరకూ ఫిట్నెస్ను ట్రాకింగ్, వాట్సాప్, కాలింగ్ వంటి ఫీచర్లు మాత్రమే ఉన్నాయి. ఇకపై మొబైల్ అంతా చిన్న డివైజ్ గా మారి చేతివాచీగా మారుతుందట. అంతేకాదు వాచీ నుంచి త్రీడీ ప్రొజెక్షన్ అంటే గాల్లోనే స్క్రీన్ వచ్చేలా సరికొత్త డివైజ్ లు కూడా రెడీ అవుతున్నాయి.
ఆటోమేటెడ్ డివైజెస్
ఇక వీటితోపాటు కారులో వెళ్లేటప్పుడు కారు ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ఏఐతో కనెక్ట్ అయ్యి పని చేయడం, సినిమాలు చూడడం కోసం ఏఆర్, వీఆర్ హెడ్ సెట్లు, స్మార్ట్ క్లాతింగ్, హెల్త్ ట్రాకింగ్ డివైజెస్ .. ఇలా ఏఐతో కనెక్ట్ అయ్యి పనిచేసే బోలెడు డివైజ్ లు రాబోతున్నాయి. ఫ్యూచర్ లో రాబోతున్న ఈ అడ్వాన్స్డ్ ఏఐ డివైజ్ ల ముందు మొబైల్ చిన్నబోవడం ఖాయం.
మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..