పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజీ సినిమా నేడు ( సెప్టెంబర్ 25)న గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమాకు మొదటి నుంచి మంచి హైప్ ఉంది. ఆ బజ్ ను సినిమా రెట్టింపు చేసింది. పవన్ చాలా కాలం తర్వాత పవర్ ఫుల్ అండ్ స్టైలిష్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఓజీ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. సినిమాలో పవన్ నటన, ఎలివేషన్స్, యాక్షన్స్ సీన్స్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. థియేటర్స్ దగ్గర అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా సీన్స్ మొత్తం కట్ చేశారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన మమతా మోహన్ దాస్
దేశవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ సినిమా సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రేక్షకులు, అభిమానులే కాదు సినీ సెలబ్రెటీలు కూడా ఓజీ సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడ చూసిన ఓజీ ఫీవరే కనిపిస్తుంది. ఇప్పటికే మెగా హీరోలు సాయి దుర్గ తేజ్, వరుణ్ తేజ్ , అకీరా, వైష్ణవ్ తేజ్ థియేటర్స్ లో సినిమా చూసి ఎంజాయ్ చేశారు. అలాగే మరికొంతమంది హీరోలు, హీరోయిన్స్ కూడా ఓజీ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు.
బెస్ట్ ఫ్రెండ్ భర్తనే వలలో వేసుకున్న స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే అతనితో..
తాజాగా ఓ ముద్దుగుమ్మ ఓజీ టీ షర్ట్‌తో సందడి చేసింది. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె మరెవరో కాదు ఓజీ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్. నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. ప్రియాంక. ఆతర్వాత శ్రీకారం అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆతర్వాత తమిళ్ లో సినిమాలు చేసింది. చిన్న గ్యాప్ తర్వాత తెలుగులో ఓజీ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వైఫ్ గా కనిపించింది ప్రియాంక. ఈ సినిమా విజయంతో ప్రియాంక ఖాతాలో భారీ హిట్ పడింది.
చేసింది రెండు సినిమాలు.. రెండూ యావరేజ్..! అయినా తగ్గని క్రేజ్.. చూస్తే ప్రేమలో పడిపోవాల్సిందే
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి