జ్యోతిష్యశాస్త్రంలో కుభేరుడికి ఉండే ప్రత్యేక స్థానం గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. కుభేరుడి కొన్ని సార్లు కొన్ని రాశులను ఇష్టపడుతుంటాడు. అంతే కాకుండా వారిపై ధన వర్షం కురిపిస్తాడు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుభేరుడికి ఇష్టమైన రాశులు ఇవేనంట. వీరిపై కుభేరుడు అక్టోబర్ నెలలో ధన వర్షం కురిపించనున్నాడు అంటున్నారు పండితులు.
తుల రాశి : తుల రాశికి కుభేరుడి అనుగ్రహం వలన పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో పురోగతి లభిస్తుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకొంటుంది. అంతే కాకుండా, వీరు త్వరలో ప్రమోషన్ పొందే ఛాన్స్ ఉంది. వ్యాపారస్తులు అత్యధిక లాభాలు అందుకుంటారు.
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. కుభేరుడి అనుగ్రహంతో ఈ రాశి వారికి లక్ష్మీ దేవి ఆశీస్సులు కూడా లభించనున్నాయి. దీంతో వీరి వ్యాపారంలో, ఉద్యోగంలో అద్భుతంగా కలిసి రానున్నది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
కుంభ రాశి : కుంభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అని చెప్పాలి. వీరు చాలా రోజుల నుంచి బాధపడుతున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఖర్చులు తగ్గిపోతాయి. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది. చాలా సంతోషంగా జీవనం గడుపుతారు.
వృషభ రాశి వారికి : కుభేరుడి అనుగ్రహం వలన ఆర్థికంగా అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. వీరికి పనుల్లో ఆటంకాలు తొలిగిపోయి, చాలా ఆనందంగా జీవిస్తారు, కళారంగంలో ఉండే వారి అద్భుతంగా ఉండబోతుంది. ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.