జోధ్‌పూర్‌లోని BAPS స్వామినారాయణ్ ఆలయం ప్రతిష్టాపన కార్యక్రమం గురువారం (సెప్టెంబర్ 25వ తేదీన) ఎంతో వైభవంగా కొనసాగుతోంది. అయితే, ఈ ప్రతిష్టాపన వేడుక కోసం ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలను BAPS స్వామినారాయణ సంస్థ అధిపతి, ఆధ్యాత్మిక గురువు, ప్రపంచ ప్రఖ్యాత సాధువు బ్రహ్మస్వరూప్ మహంత్ స్వామి మహారాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో బాణాసంచాతో అనేక రకాల ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ప్రదర్శనలు చూసేందుకు స్వామినారాయణ్ ఆలయానికి భారీగా భక్తులు తరివచ్చారు. ఇక్కడ నిర్వహించిన రంగురంగుల బాణాసంచా ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బాణా సంచా ప్రదర్శనలతో ఇక్కడ విరజిమ్మిన వెలుగులు ఆకాశాన్నంటాయి. ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా భక్తులు అపారమైన ఆనందాన్ని పొందారు.
మరిన్ని ఆథ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.