సాధారణంగా దొంగలు కత్తులు, గన్స్ చూపించి బెదిరించి దొంగతనానికి పాల్పడుతూ ఉంటారు. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం అందరికీ బిన్నంగా పాముతో రైల్వే ప్రయాణికులను భయపెట్టి వారి నుంచి డబ్బులు కాజేశాడు. అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్–సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘటన వెలుగు చూసింది. మధ్యప్రదేశ్‌లోని ముంగాలి, బినా జంక్షన్ల వద్ద ఒక పాములు పట్టే వ్యక్తి తన చేతితో పామును పట్టుకొని ట్రైన్‌లోకి ఎక్కాడు. ఆ తర్వాత తన చేతిలో ఉన్న పామును చూపిస్తూ ప్రయాణికులను డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. పామును చూసి భయపడిపోయిన ప్రయాణికులు వెంటనే తమ పర్సుల్లోంచి డబ్బులు తీసి అతనికి ఇచ్చేశారు. పక్కనే ఉన్న ఒక ప్రయాణికుడు ఈ తతంగాన్నంత వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఆ పోస్ట్‌లో అతను ఇలా రాసుకొచ్చాడు.. భారతీయ రైల్వేలో కష్టపడి పనిచేసే కార్మిక వర్గం నుంచి డబ్బులు వసూలు చేసేందుకు కొందరు వ్యక్తులు ఇలాంటి కొత్త మార్గాలను వెతుకుతున్నట్టు పేర్కొన్నాడు. అలాగే ఆ వీడియోను రైల్వే శాఖను ట్యాగ్ చేశాడు.
ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారి రైల్వేశాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రయాణ వివరాలను మొబైల్ నంబర్‌ను తమకు పంపించాలని కోరారు. మరోవైపు, ఈ వీడియో చూసిన నెటిజన్లు అ వ్యక్తి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్న వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
వీడియో చూడండి..
அகமதாபாத் சபர்மதி எக்ஸ்பிரஸ் ரயிலில், பாம்பைக் காட்டி, பயணிகளை மிரட்டி பிச்சை எடுத்த நபரால் பரபரப்பு… நடவடிக்கை எடுக்க ஆர்.பி.எப்-க்கு ரயில்வே உத்தரவு.#Train #Snake #RPF #RailwayDepartment pic.twitter.com/JKIYlQEkhd
— M.M.NEWS உடனடி செய்திகள் (@rajtweets10) September 23, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..