Team India : రోహిత్, కోహ్లీ ఎక్కడ? ఆస్ట్రేలియా టూర్ ముందు ఇండియా ‘ఏ’ జట్టులో కనిపించని బిగ్ స్టార్స్

Team India : రోహిత్, కోహ్లీ ఎక్కడ? ఆస్ట్రేలియా టూర్ ముందు ఇండియా ‘ఏ’ జట్టులో కనిపించని బిగ్ స్టార్స్


Team India : క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా A, ఆస్ట్రేలియా A వన్డే సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనుకున్నట్లుగానే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేర్లు జట్టులో లేవు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తూ, శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

ఆసియా కప్‌లో తన విధ్వంసక ఫామ్‌తో ఆకట్టుకున్న యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా ఈ స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు. అతడు రెండో, మూడో వన్డేలలో ఇండియా A తరఫున ఆడనున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో జరగబోయే వన్డే సిరీస్‌కు టీమ్ ఇండియాలో అభిషేక్ శర్మకు చోటు దక్కే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో ఈ A సిరీస్ అతనికి ఒక కీలకమైన అగ్నిపరీక్షగా నిలవనుంది.

ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు కోహ్లీ, రోహిత్ ఇద్దరూ ఇండియా A తరఫున ఆడాలని సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ, తాజాగా ప్రకటించిన స్క్వాడ్‌లో వీరిద్దరి పేర్లు లేకపోవడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. వీరు కావాలనే విశ్రాంతి తీసుకున్నారా, లేక సెలక్టర్ల ప్లాన్ ఏమైనా మారిందా అనే విషయంపై సస్పెన్స్ నెలకొంది. కాగా, బీసీసీఐ ఈ మూడు వన్డేల కోసం రెండు వేర్వేరు స్క్వాడ్‌లను ఎంపిక చేసింది.

మొదటి వన్డేకు ఇండియా A స్క్వాడ్

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ప్రభసిమ్రాన్ సింగ్, రియాన్ పరాగ్, ఆయుష్ బదోని, సూర్యాంశు షెడ్గే, విప్రాజ్ నిగమ్, నిశాంత్ సింధు, గుర్జపనీత్ సింగ్, యుద్ధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్, అభిషేక్ పోరెల్, ప్రియాంశ్ ఆర్య, సిమర్‌జీత్ సింగ్.

రెండో, మూడో వన్డేలకు ఇండియా A స్క్వాడ్

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్-కెప్టెన్), అభిషేక్ శర్మ, ప్రభసిమ్రాన్ సింగ్, రియాన్ పరాగ్, ఆయుష్ బదోని, సూర్యాంశు షెడ్గే, విప్రాజ్ నిగమ్, నిశాంత్ సింధు, గుర్జపనీత్ సింగ్, యుద్ధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్, అభిషేక్ పోరెల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్.

ఇరానీ కప్ కారణంగా స్టార్ ప్లేయర్స్ గైర్హాజరు

ఈ ఇండియా A జట్టులో రజత్ పటీదార్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ వంటి ప్రముఖ యువ ఆటగాళ్ల పేర్లు లేకపోవడానికి ప్రధాన కారణం ఇరానీ కప్. కాగా అక్టోబర్ 1 నుంచి ఇరానీ కప్ ప్రారంభం కానుండగా, ఈ ఆటగాళ్లు రెస్ట్ ఆఫ్ ఇండియా స్క్వాడ్‌లో ఉన్నారు. రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకు రజత్ పటీదార్ కెప్టెన్‌గా, రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

రెస్ట్ ఆఫ్ ఇండియా స్క్వాడ్

రజత్ పటీదార్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, ఆర్యన్ జుయాల్, రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశ్ ధుల్, షేక్ రషీద్, ఇషాన్ కిషన్, తనుష్ కొటియన్, మానవ్ సుతార్, గుర్నూర్‌ బ్రార్, ఖలీల్ అహ్మద్, ఆకాశ్ దీప్, అన్షుల్ కంబోజ్, సారంగ్. ఈ విధంగా బీసీసీఐ సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తూ, యువ ఆటగాళ్లకు జాతీయ స్థాయి వేదికపై తమ ప్రతిభను నిరూపించుకునే గొప్ప అవకాశాన్ని ఇచ్చింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *