కొన్ని సినిమాలు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఎలాంటి హడావిడి లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తాయి. భారతీయ సినిమా చరిత్రలో అనేక రికార్డ్స్ బ్రేక్ చేసిన మూవీస్ గురించి చెప్పక్కర్లేదు. మీకు తెలుసా.. దాదాపు 8 సంవత్సరాల క్రితం విడుదలైన ఒక సినిమా పాన్ ఇండియాల్లో భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసింది. తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటికీ ఈ సినిమా ట్రెండ్ అవుతుంది. ఆ మూవీ ఏంటో తెలుసా.. ? అదే బాహుబలి 2 ది కన్‌క్లూజన్. 2017 ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమా రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. జనాలకు ఈ సినిమా కథ, విజవల్ ఎపెక్ట్ తెగ నచ్చేసింది.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi: అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఆ తర్వాత చిరు చెల్లెలిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడు బుల్లితెరపై..
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇందులో ప్రభాస్ అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబిలగా ద్విపాత్రాభినయం చేశారు. ఆయనతోపాటు రానా, అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ కీలకపాత్రలు పోషించారు. 2015లో విడుదలైన బాహుబలి ది బిగినింగ్ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన ఈ కథకు జనాలు అడిక్ట్ అయ్యారు. మాహిష్మతి రాజ్యంలో అధికారం కోసం జరిగిన పోరాటమే ఈ చిత్రం. అమరేంద్ర బాహుబలి, భల్లాలదేవ మధ్య శత్రుత్వం, కట్టప్ప అమరేంద్రను చంపడానికి కారణం, తరువాత కుమారుడు మహేంద్ర బాహుబలి తన తండ్రి కోసం ప్రతీకారం తీర్చుకునే కథ ప్రేక్షకుల హృదయాలను తాకింది. ఈ సినిమా అప్పట్లో అనేక రికార్డులను బద్దలు కొట్టింది.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి : Tollywood: స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ ఈ అమ్మడు..
అప్పట్లో ఈ సినిమా భారతదేశంలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1810.60 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లోకి ఈ సినిమా వచ్చింది. అంతేకాదు ఓటీటీలోనూ అత్యధికంగా వ్యూస్ వచ్చిన సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Tollywood : అబ్బబ్బో.. సీరియల్లో అమాయకంగా.. నెట్టింట పిచ్చెక్కించేలా.. హీరోయిన్స్ సైతం దిగదుడుపే..
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో ఆడపులి.. యూత్‌కు తెగ నచ్చేస్తోన్న కంటెస్టెంట్..