ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సినిమా ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజీత్ కాంబోలో వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. గ్యాంగ్స్ డ్రామాతో వచ్చిన ఈ చిత్రంలో ఓజాస్ గంభీర పాత్రలో నటించాడు పవన్. ఇందులో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి కీలకపాత్రలు పోషించగా.. ఇక మ్యూజిక్ ఇరగదీశాడు తమన్. ముఖ్యంగా పవన్ ఎలివేషన్స్, తమన్ బీజీఎమ్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసిన ఓజీ మేనియా కనిపిస్తుంది. థియేటర్లు, సోషల్ మీడియాలో ఓజీ పేరు మారుమోగుతుంది. ఈ క్రమంలో బుల్లితెరపై సైతం ఓజీ హవా నడుస్తుంది. ముఖ్యంగా ఓ సీరియల్ బ్యూటీ ఓజీ సినిమా ట్రెండ్ తన స్టైల్లో షేర్ చేసుకుంది.
ఇవి కూడా చదవండి : Tollywood : అబ్బబ్బో.. సీరియల్లో అమాయకంగా.. నెట్టింట పిచ్చెక్కించేలా.. హీరోయిన్స్ సైతం దిగదుడుపే..
ఇవి కూడా చదవండి
పైన ఫోటోను చూశారు కదా.. అందులో ఓజీ మూవీ ట్రెండ్ సెట్టర్ చేస్తున్న ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. ? తన టాలెంట్ చూపిస్తూ ఓజీ క్రాప్ టాప్ తో ఫోటోలకు ఫోజులిచ్చింది. బుల్లితెరపై సీరియల్స్ లో తల్లి పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామరస్ రచ్చ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరంటే.. తనే గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జగతి మేడమ్ అలియాస్ జ్యోతిరాయ్. ఈ సీరియల్లో రిషి తల్లిగా చాలా పద్దతిగా.. ఎంతో హుందగా కనిపించి తన నటనతో జనాలను ఆకట్టుకుంది. జగతి మేడమ్ పాత్రలో అందరినీ మెప్పించిన జ్యోతిరాయ్ ఇప్పుడు గేర్ మార్చింది. ఇన్నాళ్లు చీరకట్టులో ఎంతో పద్దతిగా కనిపించిన ఆమె.. నెట్టింట మాత్రం అందాల అరాచకం సృష్టిస్తుంది.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో ఆడపులి.. యూత్‌కు తెగ నచ్చేస్తోన్న కంటెస్టెంట్..
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో అగ్గిరాజేస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఓజీ మేనియాలో భాగంగా ఓజీ పేరుతో ఉన్న టీషర్ట్ ఫోటోస్ షేర్ చేసింది. ఇప్పుడు ఆమె షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
ఇవి కూడా చదవండి : Tollywood: స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ ఈ అమ్మడు..
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi: అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఆ తర్వాత చిరు చెల్లెలిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడు బుల్లితెరపై..