డిజిటల్ చెల్లింపుల పెరుగుదలతో ఇంట్లో నగదు నిల్వలు తగ్గుతున్నాయి. అయితే, ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవచ్చు అనేది చర్చనీయాంశం. ఆదాయపు పన్ను చట్టం నేరుగా ఎటువంటి పరిమితిని నిర్దేశించదు. కానీ, ఆ నగదు చట్టబద్ధంగా సంపాదించినదై ఉండాలి . దానికి లెక్కలు ఉండాలి. మీ జీతం, వ్యాపార ఆదాయం లేదా ఇతర చట్టబద్ధమైన మార్గాల ద్వారా సంపాదించిన నగదు అని మీరు నిరూపించగలిగితే, ఎంతైనా మొత్తాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు. కానీ ఆదాయ మూలాన్ని నిరూపించలేకపోతే, సెక్షన్ 68 , 69బి ప్రకారం, అది వెల్లడించని ఆదాయంగా పరిగణించబడుతుంది ,జరిమానాలు విధించే అవకాశం ఉంది. కాబట్టి, నగదు నిల్వలకు సంబంధించి సరైన రికార్డులను ఉంచుకోవడం చాలా ముఖ్యం.
మరిన్నివీడియోల కోసం :