అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ వివాదాల్లో చిక్కుకున్నారు. పిల్లల ఆరోగ్యం, టీకాలు, ఆటిజంలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారితీశాయి. ట్రంప్ తన వ్యాఖ్యల్లో, పిల్లల్లో ఆటిజం పెరుగుదలకు టైలినాల్ (పారాసిటమాల్) ఒక కారణమని, గత 22 ఏళ్లలో అమెరికాలో ఆటిజం కేసులు 400% పెరిగాయని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (FDA) నివేదికల ఆధారంగా ఉన్నాయని ఆయన వాదించారు. అయితే, ఈ వాదనలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తో పాటు యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ ఖండించాయి. WHO ట్రంప్ వాదనలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేసింది. యూరోపియన్ దేశాల్లో పారాసిటమాల్ (అసిటామినోఫెన్) ని గర్భిణీ స్త్రీలు సాధారణంగా నొప్పులు , జ్వరం ఉన్నప్పుడు వాడుతుంటారని, ప్రస్తుతం ఆ మందును మార్చే అవసరం లేదని కూడా ఏజెన్సీ పేర్కొంది.
మరిన్నివీడియోల కోసం :